Cinema : నిజమైన సంఘటనలతో సినిమా.. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న మూవీ..

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించాయి. అలాగే కొన్ని సినిమాలు మాత్రం అవార్డుల తుఫాను సృష్టించాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం అలాంటిదే. ఉత్తమ నటిగా, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంభాషణ, ఉత్తమ మేకప్ ఇలా వివిధ విభాగాల్లో అనేక జాతీయ అవార్డులు గెలుచుకుంది.

Cinema : నిజమైన సంఘటనలతో సినిమా.. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న మూవీ..
Gangubai Kathiawadi

Updated on: Mar 08, 2026 | 4:27 PM

స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా. అప్పటివరకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. ఈ ఒక్క సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన సినీప్రయాణంలో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. జాతీయ అవార్డులతోపాటు మిగతా విభాగాల్లో ఏకంగా 49 పురస్కారాలను అందుకుంది. నిజమైన సంఘటనలతో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు వీకెండ్ లో మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు గంగూభాయి కతియావాడి.
ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

2022లో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ. ఇందులో అలియా భట్ ప్రధాన పాత్రలో నటించగా.. అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ సంగీతం అందించగా.. నిర్మాతగానూ వ్యవహరించారు. కథ విషయానికి వస్తే.. సంపన్న కుటుంబంలో జన్మించిన గంగుబాయి అనే అమ్మాయి.. సినిమాలో నటి కావాలనే కోరికతో తన ప్రేమికుడితో కలిసి ఇల్లు వదిలి బయటకు వచ్చేస్తుంది. కానీ అతడు ఆమెను మోసం చేసి ఒక వ్యభిచార గృహంలో అమ్మేస్తాడు. అక్కడ ఎన్నో కష్టాలు పడిన ఆమె.. చివరకు తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటుంది. తనతోపాటు అక్కడే ఉండే మహిళల హాక్కుల కోసం మాట్లాడుతుంది. చివరకు ఆమెకు ఏం జరిగిందనేది కథ.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈసినిమాలో గంగుబాయి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది అలియా భట్. ఈ చిత్రంలో ఆమె నటనకు ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంభాషణ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ మేకప్ విభాగాలలో జాతీయ అవార్డులు లభించాయి. అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా లభించాయి. ఈ చిత్రం దాదాపు 49 అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..

Follow Us