
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడిన వారే. పొట్ట కూటి కోసం చిన్న చితకా పనులు చేసిన వారే. అయితే ఈ టాలీవుడ్ సెన్సేషన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఇతను చిన్నప్పుడు వైజాగ్ లో ఓ థియేటర్ ముందు అరటి పండ్లు అమ్మాడు. తద్వారా తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచాడు. అంతేకాదు ఓ స్టిక్కరింగ్ షాపు కూడా నడిపాడు. కాలేజీలో చదువుకుంటూనే నెంబర్ ప్లేట్లు రెడీ చేశాడు. అలా సినిమాలపై ఇంట్రెస్టుతో హైదరాబాద్ కు వచ్చాడు. తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో ఓ స్టార్ హీరో సినిమా కొన్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా మంచి లాభాలు అందుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ గానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. జయ పజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీశాడు. తన ట్యాలెంట్, టేకింగ్ తో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడీ డైరెక్టర్ ఓ పాన్ ఇండియా సూపర్ స్టార్ తో కలిసి ఓ సినిమా తీస్తున్నాడు. అది కూడా రూ. 400 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో. దీంతో ఈ టాలీవుడ్ డైరెక్టర్ పేరు ఇప్పుడు నేషనల్ వైడ్ గా మార్మోగిపోతోంది.
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ డైరెక్టర్ ఇప్పటివరకు పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు. ఈ క్రమంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ తో ఈ దర్శకుడు ఎలాంటి సినిమా తీస్తాడోనని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఇతని సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో?యస్.. అతను మరెవరో కాదు ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. ది రాజా సాబ్ రిలీజ్ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. మారుతి సొంతూరు వైజాగ్. రాధికా థియేటర్ ఎదురుగా ఒకప్పుడు ఆయన తండ్రికి అరటి పండ్ల బండి ఉండేదట. తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచిన మారుతి తీరిక దొరికినప్పుడల్లా అరటి పండ్లు అమ్మేవాడట. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.