Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా..

తెలుగు అడియన్స్ హృదయాల్లో ఇప్పటికీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమా ఆనంద్. ఈ మూవీకి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమాతోనే. అంతకు మందు పలు సినిమాలు చేసినప్పటికీ ఆనంద్ మూవీతో తెలుగులో ఆయన పేరు మారుమోగింది.

Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా..
Anand

Updated on: Dec 18, 2025 | 1:37 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మాస్ యాక్షన్, హీరో ఎలివేషన్స్, రొమాంటిక్ సీన్స్ కాకుండా ప్రేక్షకులకు నచ్చే విధంగా.. సహజ ప్రేమకథలుగా సాగిపోతుంటాయి. అందుకే శేఖర్ కమ్ముల సినిమాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన ఆయన ఆనంద్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు పోటీగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

ఇందులో రాజా, కమలినీ ముఖర్జీ జంటగా నటించగా.. ఇద్దరి కెమిస్ట్రీ, యాక్టింగ్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైన కమలినీ.. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఇందులో అందం, అమాయకత్వం, మొండితనం కలగలసిన రూప పాత్రలో మరింత అద్భుతంగా నటించింది. దీంతో ఈ సినిమాతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. అయితే రూప పాత్రకు ఆమె ఫస్ట్ ఛాయిస్ కాదట. ముందుగా ఈ సినిమా కథను శేఖర్ కమ్ముల మరో హీరోయిన్ కు వినిపించారట.

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ కథ కమలినీ వద్దకు చేరింది. ఆమె మరెవరో కాదు.. జయం సినిమాతో తొలి చిత్రానికి హిట్టు అందుకున్న సదా. తెలుగులో జయం, నాగ వంటి చిత్రాలలో నటించిన సదా.. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. అప్పుడే ఆమెను దృష్టిలో పెట్టుకుని ఆనంద్ సినిమాలో రూప పాత్రను డిజైన్ చేసుకున్నాడట. కానీ సదా ఆ సినిమాను రిజెక్ట్ చేయడంతో.. అప్పుడప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తున్న కమలినీ అదృష్టం వరించింది. సదా ఆనంద్ సినిమాను చేసి ఉంటే కెరీర్ మరోలా ఉండేదేమో.

ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..