
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరోవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పదవీబాధ్యతలు నిర్వహిస్తూనే సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాతో ప్రేక్షకులను అలరించారు పవన్. ఇక త్వరలొన్చే ఓజీ 2 సినిమాలోనూ నటించనున్నారని తెలుస్తుంది. కాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతూ ఉంటాయి. ఆయన రాజకీయాలకు సంబందించినవి కొన్ని వైరల్ అవుతుంటాయి.. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబందించిన విషయాలు కొన్ని చక్కర్లు కొడుతుంటాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఓల్డ్ ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ త్రో బ్యాక్ ఫోటోను ఆయన అభిమానులు, నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. పై ఫోటో చూశారా.? ఆ ఫొటోలో పవన్ కళ్యాణ్ తో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? ఆయన ఓ ప్రముఖ దర్శకుడు. చాలా పాపులర్ ఆయన. ఆయన ఎవరో కనిపెట్టండి చూద్దాం.! పవన్ కళ్యాణ్ తో ఉన్న ఆ వ్యక్తి మహేష్ బాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన ఎవరో కాదు దర్శకుడు మెహర్ రమేష్. ఆ టాలీవుడ్ డైరెక్టర్ ముందుగా కన్నడ సినిమాతో దర్శకుడిగా మారారు. పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే మరోసారి పునీత్ రాజ్ కుమార్ తో కలిసి అజయ్ అనే సినిమా చేశారు. ఈ సినిమా మహేష్ బాబు ఒక్కడు సినిమాకు రీమేక్. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతర్వాత తెలుగులో సినిమాలు చేశారు మెహర్ రమేష్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి 2008లో కంత్రి అనే సినిమా చేశారు. ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమా తెరకెక్కించాడు మెహర్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్ కెరీర్ లో స్టైలిష్ మూవీగా నిలిచింది బిల్లా. ఆతర్వాత 2011లో ఎన్టీఆర్ తో కలిసి శక్తి అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. 2013లో వెంకటేష్ తో కలిసి షాడో అనే సినిమా చేశారు. అది కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో మెహర్ రమేష్ పదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. పదేళ్ల తర్వాత రీసెంట్ గా భోళా శంకర్ సినిమా చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తాజాగా మెహర్ రమేష్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ హాజరైనప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి