Tollywood: ఇండస్ట్రీని రూల్ చేసిన చిన్నది.. ఎయిర్ హోస్టెస్ జాబ్ మానేసి సినిమాల్లోకి.. చివరకు..

బాలీవుడ్‌లో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలి అనుకోడం చాలా మందికి ఒక కల. అదృష్టం కలిసి వచ్చి, కష్టపడి పనిచేస్తే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోగలరు. కానీ అందం, అభినయంతోపాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుబోయే నటి మాత్రం ఎయిర్ హోస్టెస్ జాబ్ మానేసి మరీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Tollywood: ఇండస్ట్రీని రూల్ చేసిన చిన్నది.. ఎయిర్ హోస్టెస్ జాబ్ మానేసి సినిమాల్లోకి.. చివరకు..
Actress

Updated on: Jun 13, 2025 | 5:09 PM

ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాంటే టాలెంట్ మాత్రమే కాదు.. కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే. కానీ ఎన్నో సవాళ్లు, కష్టాలు ఎదుర్కొని సినీరంగంలో స్టార్ డమ్ సంపాదించుకుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ మాత్రం లక్షలు జీతం వచ్చే ఉద్యోగం వదిలి సినిమాల్లోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ అంతే తక్కువ సమయంలో ఇండస్ట్రీ నుంచి అదృశ్యమయ్యింది. సినీరంగుల ప్రపంచంలో గ్లామర్, బోల్డ్ సీన్లతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదండి.. బీటౌన్ బ్యూటీ మల్లికా షెరావత్. ఈ అమ్మడు మొదట్లో ఎయిర్ హోస్టెస్.

అదే సమయంలో పైలట్‌గా పనిచేసిన కరణ్ సింగ్ గిల్‌తో స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లకే వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మల్లికకు సినిమా ఆఫర్లు రావడం ప్రారంభించినప్పుడు.. ఆమె తన వివాహ బంధాన్ని దాచిపెట్టాలని అనుకుంది. తాను వివాహం చేసుకున్నానని పరిశ్రమలోని వ్యక్తులకు తెలిస్తే తనకు అవకాశాలు రావని తెలిపింది. 2002లో జీనా సిర్ఫ్ మేరే లియో సినిమాలో చిన్న పాత్రలలో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2004లో మర్డర్ సినిమాతో ఆమె కెరీర్ మారిపోయింది. దీంతో హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.

ఒకప్పుడు స్పెషల్ పాటలతో ఇండస్ట్రీని శాసించిన మల్లికా.. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమయ్యింది. కొన్నాళ్లు సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు నెట్టింట వరుస పోస్టులు చేస్తూ బిజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల రాజ్ కుమార్ రావు, త్రిప్తి డిమ్రీ కలిసి నటించిన విక్కీ విద్యా కా వో వాలా సినిమాతో తిరిగి వెండితెరపై సందడి చేసింది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..