
Anushka Shetty
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ సినీ ప్రయాణం స్టార్ట్ చేయకముందు యోగా టీచర్. ఎంతో మంది విద్యార్థులకు యోగా నేర్పిస్తూ ప్రశాంతమైన జీవితం గడిపింది. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆమె నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.2400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఫిట్‌నెస్ నుండి కీర్తికి ఆమె ప్రయాణం సినిమాటిక్ లాగా అనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? అనుష్క శెట్టి. వెండితెరపైకి రాకముందు ఆమె భరత్ ఠాకూర్ దగ్గర శిక్షణ పొందిన సర్టిఫైడ్ యోగా టీచర్. దర్శకుడు మెహర్ రమేష్ యోగా సెషన్‌లో ఆమెను చూసి సినిమా ఛాన్స్ ఇచ్చారట.
అనుష్కను ముందుగా డైరెక్టర్ మెహర్ రమేష్ పూరి జగన్నాధ్‌కు పరిచయం చేశారు. 2005లో నాగార్జున నటించిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహానంది, అరుంధతి, విక్రమార్కుడు, ఢమరుకం, మిర్చి, బిల్లా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ప్రభాస్ సరసన నటించిన బాహుబలి సినిమా ఆమె కెరీర్ మార్చేసింది. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
వీరిద్దరి కాంబోలో వచ్చిన బాహుబలి 1, 2 సినిమాలు వరల్డ్ వైడ్ రూ.2400 కోట్లకు పైగా వసూలు చేశాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు సంచలనం సృష్టించాయి. భిన్నంగా ఉండే పాత్రలను ఎంచుకోవడంలో అనుష్క ముందుంటుంది. బాహుబలి సినిమా తర్వాత సైలెంట్ అయిన అనుష్క.. ఇప్పుడు ఎప్పుడో ఒక సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఘాటి చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం అనుష్క ఆస్తులు రూ.140 కోట్లు.