
సినీరంగుల ప్రపంచంలో నటీనటులుగా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. సవాళ్లు, ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొని ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. వరుస అవకాశాలు అందుకుని తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే జరిగిన పొరపాట్లతో చివరకు గ్లామర్ ప్రపంచానికి దూరమవుతుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం.. తండ్రి చేతిలోనే హత్యకు గురైంది. ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ ఆమె ఎవరు.. ? ఏం జరిగిందనే విషయాలు తెలుసుకుందామా.?
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె తోపు హీరోయిన్. తనే లైలా ఖాన్. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లైలా.. రాజేశ్ ఖన్నా సరసన వాఫా : ఎ డెడ్లీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తన కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లింది. అంతే.. ఇక ఆ తర్వాత ఆమెతోపాటు తన ఫ్యామిలీ కూడా కనిపించకుండాపోయింది. తన కూతురు, కుటుంబం కనిపించడం లేదంటూ లైలా ఖాన్ తండ్రి పోలీసులను ఆశ్రయించగా.. చాలా కాలం వెతికిన పోలీసులు చివరకు అతడిపైనే అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
లైలా ఖాన్ సవతి తండ్రి పర్వేజ్ ఆమెను హత్య చేసినట్లు అంగీకరించాడు. 2011లో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఇగత్ పురిలో లైలా ఖాన్తోపాటు ఆమె తల్లి షెలీనా, కజిన్స్ అజ్మీనా, జారా, ఇమ్రాన్, రేష్మాను కాల్చి చంపాడు. వారి మృతదేహాలను అక్కడ ఓ బంగ్లాలో పాతిపెట్టాడు. ఈ ఘటన జరిగిన 9 నెలలకు ఆమె సవతి తండ్రి పర్వేజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆస్తి వివాదాల కారణంగానే లైలా ఖాన్ కుటుంబాన్ని హత్య చేసినట్లు విచారణలో పర్వేజ్ తక్ ఒప్పుకున్నాడు. దాదాపు పదేళ్లపాటు ఈ కేసుపై విచారణ జరగ్గా.. చివరకు అతడికి కోర్టు మరణ శిక్ష విధించింది.
Laila Khan Life
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..