ఆ స్టార్ హీరోకి అప్పుడు లవర్‌గా.. ఇప్పుడు తల్లిగా.. ఫ్యాన్స్‌ను షాక్ గురిచేసిన స్టార్ హీరోయిన్

హీరోయిన్స్ చాలా మంది సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా నటిస్తూ ఉంటారు. కొంతమంది హీరోల సరసన హీరోయిన్స్ గానే కాదు, అమ్మగాను నటిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ టాప్ హీరోకు ఒకప్పుడు లవర్ గా నటించి ఇప్పుడు తల్లిగా నటిస్తుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..

ఆ స్టార్ హీరోకి అప్పుడు లవర్‌గా.. ఇప్పుడు తల్లిగా.. ఫ్యాన్స్‌ను షాక్ గురిచేసిన స్టార్ హీరోయిన్
Actress

Updated on: May 21, 2025 | 11:44 AM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తండ్రి కొడుకులతో కలిసి నటించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. హీరోయిన్స్ చాలా మంది సీనియర్ హీరోలతో పాటూ యంగ్ హీరోలతోనూ నటించి మెప్పిస్తున్నారు. సినిమా కథలో బలం ఉంటే ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. అలాగే హీరోల సరసన లవర్స్ గా నటించిన వారు అదే హీరోలకు చెల్లి పాత్రలు, అమ్మ పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా ఒకప్పుడు హీరో సరసన లవర్ గా చేసింది. ఇప్పుడు అదే హీరోకి తల్లిగా నటిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఆ బ్యూటీ.

ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామ త్రిష కృష్ణన్. త్రిష ఇప్పటికే ఎన్నో రకాల పాత్రల్లో నటించింది. ఇప్పుడు ఈ భామ ఓ స్టార్ హీరోకి గతంలో లవర్ గా నటించింది.. ఇప్పుడు ఆ హీరోకి తల్లిగా నటిస్తుంది. త్రిష కృష్ణన్, శింబుతో గతంలో “విన్నైతాండి వరువాయా” (తెలుగులో ఏ మాయ చేసావే) వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో ఈ ఇద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో పడ్డారని టాక్ వచ్చింది.

ఇక ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థగ్ లైఫ్” చిత్రంలో త్రిష కమల్ హాసన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో శింబు కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ ఆధారంగా, త్రిష కమల్ హాసన్ జోడీగా కనిపిస్తుందని, శింబుకు తల్లి పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఇది అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది, ఎందుకంటే గతంలో కలిసి జోడీగా కనిపించిన త్రిష ఇప్పుడు శింబుకు తల్లిగా నటించడం అందరిని షాక్ కు గురిచేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.