
ప్రస్తుతం సినీరంగంలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. చిన్న వయసులోనే నటనపై ఆసక్తి పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. స్కూల్ విద్యను మధ్యలోనే వదిలేసి సినీరంగంకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఆమె కోట్లకు యజమాని. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు..హీరోయిన్ అలియా భట్. ఆమె తండ్రి మహేష్ భట్.. ఫేమస్ డైరెక్టర్ కమ్ నిర్మాత. ఆమె తల్లి సోనీ రాజ్ నటి. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన నటి అలియా భట్ చదువు మానేసి 12వ తరగతి కూడా పూర్తి చేయకుండానే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.1999లో ‘సంఘర్ష్’ అనే హిందీ చిత్రం ద్వారా బాలనటిగా అలియా భట్ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2012లో కరణ్ జోహార్ నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
కథానాయికగా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తన మొదటి సినిమాతోనే మంచి నటిగా ప్రశంసలు అందుకున్న అలియా భట్ ఇప్పుడు అనేక అవార్డులను గెలుచుకుంది. ఇక కొన్ని రోజుల క్రితం విడుదలైన గంగూబాయి కతియావాడి సినిమాలో అద్భుత నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో సీత పాత్రలో కట్టిపడేసింది. హిందీలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన అలియా భట్.. ఇటు తెలుగుతోపాటు .. అటు హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించిన అలియా.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. వీరికి రహా కపూర్ అనే కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో అలియా భట్ ఒకరు. అంతేకాకుండా ఆమె నిర్మాత కూడా. నివేదికల ప్రకారం అలియా భట్ ఆస్తుల విలువ రూ. 550 కోట్లకు పైగానే ఉంటుంది. అపార్ట్‌మెంట్లు, భారీ బంగ్లా, వివిధ రకాల కార్లతో బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ తదుపరి చిత్రం ‘ఆల్ఫా’ విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది ‘లవ్ అండ్ వార్’ విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..