
సినీరంగుల ప్రపంచంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. నటిగా తెరంగేట్రం చేసేందుకు టాప్ MNC కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ సైతం వదిలేసింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లోనే వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో హిట్టు అందుకుంది. ఈ మూవీతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అందంతోపాటు అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
ఆ తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు లేకపోవడం సహయ నటిగా నటించేందుకు రెడీ అయ్యింది. చివరగా టెల్లు స్క్రైర్ చిత్రంలో కనిపించింది. ప్రియాంక జవాల్కర్.. అచ్చ తెలుగమ్మాయి. 1992లో నవంబర్ 12న ఏపీలోని అనంతపురంలో మరాఠీ కుటుంబంలో జన్మించింది. హైదరాబాద్ నేషనల్ ఇన్ స్టిట్టూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకుంది. అనంతరం అమెరికాలోని ఓ MNC కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేసింది.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కలవరమాయే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. అప్పుడు కేవలం రూ.6000 పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత టాక్సీవాలా సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలలో నటించేందుకు రెడీగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..