
మర్యాద రామన్న.. తెలుగు సినీప్రియులకు ఇష్టమైన సినిమాల్లో ఇది ఒకటి. ఎలాంటి హడావిడి, స్టార్ ప్రమోషన్స్ లేకుండా చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. అద్భుతమైన కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో సునీల్ హీరోగా నటించారు. డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. సునీల్ సరసన సలోని కథానాయికగా నటించింది. ఇందులో వీరిద్దరి జోడీ, కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ సినిమాలోని పాటలకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ మూవీ ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె ఎవరు.. ? ఎందుకు ఈ చిత్రాన్ని వదులుకుందో తెలుసుకుందామా.
ఆర్కా మీడియా బ్యానర్ పై యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ చిత్రాన్ని నిర్మించగా.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. బ్రహ్మాజీ, రావు రమేష్, ఎస్ఎస్ కాంచి, సుబ్బరాయ శర్మ కీలకపాత్రలు పోషించారు. 2010 జూలై 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇంటి గడప దాటేంతవరకు అతిథి ప్రాణాలను తీయని ఒక ఊరి పెద్ద ఇంటికి వచ్చిన సునీల్.. ఆ తర్వాత అతడే ఆ ఇంటి శత్రువు అని తెలుసుకోవడం.. ఇంట్లో నుంచి బయటపడకుండా ఉండేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది సినిమా.
అయితే ఈ సినిమాకు త్రిష లేదా అనుష్క శెట్టి అయితే బాగుంటుందని భావించారట. ముఖ్యంగా త్రిషను ఈ సినిమా కోసం సప్రందించగా.. ఆమె సున్నితంగా రెజిక్ట్ చేసింది. అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండడం.. సునీల్ హీరో కావడం.. ఈ రెండు కారణాలతోనే త్రిష ఈచిత్రాన్ని వదులుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియరాలేదు. ప్రస్తుతం నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది త్రిష.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..