
ప్రస్తుతం మనదేశంలో అత్యంత ధనవంతులైన నటుల గురించి మాట్లాడుకుటే.. షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, నాగార్జున, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. అయితే ఈ జాబితాలో కొందరు హీరోయిన్లు కూడా ఉన్నారు. చాలా తక్కువ సినిమాలు చేసిన కొంతమంది నటీమణులు రూ. కోట్లలో ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి ఒక ప్రముఖ హీరోయిన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. చాలా మంది హీరోయిన్ల లాగే ఈ బ్యూటీ తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించింది. ఒక సోప్ యాడ్ తో దేశమంతా గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే ఫ్యాషన్ ప్రపంచం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ చిత్రాలలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది.అయితే ఈ ముద్దుగుమ్మ చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయినా ఆమె ఆస్తులు రూ. 700 కోట్లకు పైగా ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? పూజా బాత్రా.
పూజా బాత్రా మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 1993లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో రన్నరప్‌గా నిలిచిన ఆమె , మిస్ ఇంటర్నేషనల్ 1993లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 1993 కిరీటాన్ని గెలుచుకుంది. దీనితో పాటు పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఇక హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో యాక్ట్ చేసింది. తన కెరీర్ లో ఎక్కువగా హిందీ సినిమాలు చేసిన పూజా బాత్రా తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సిసింద్రీ సినిమాలో ఓ స్పెషల్ రోల్ లో సందడి చేసిందీ అందాల తార. అలాగే దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు కుమారుడు అరుణ్ కుమార్ హీరోగా తెరకెక్కిన గ్రీకు వీరుడు సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
పూజా బాత్రా 2003లో న్యూఢిల్లీలో ఆర్థోపెడిక్ సర్జన్ సోను ఎస్. అహ్లువాలియాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌కు వెళ్లిపోయారు. ఎనిమిదేళ్లు కలిసి కాపురం చేసిన ఈ జంట 2011లో విడాకులు తీసుకుంది. దీని తర్వాత తెలుగుతో పాటు పలు హిందీ సినిమాల్లో విలన్ గా నటించిన నవాబ్ షాతో డేటింగ్ చేసింది. వీరు 2019 లో ఢిల్లీలో ఆర్య సమాజ్ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు .
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.