
భారతీయ సినీపరిశ్రమలో ఒకప్పుడు ఆమె లేడీ సూపర్ స్టార్. అందం, అభినయంతో ఇండస్ట్రీని శాసించింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఆమె… తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలోని అందరూ స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కేవలం 12 సంవత్సరాల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. కానీ 31 ఏళ్ల వయసులో కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే ఎవరు ఊహించని విధంగా విమాన ప్రమాదంలో మరణించింది. ఆమె మరణవార్తతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికీ సినీరంగంలో ఆ హీరోయిన్ మృతి తీరని లోటు. ఆమె మరెవరో కాదండి.. దివంగత అందాల రాశి సౌందర్య. బెంగుళూరుకు చెందిన ఆమె అసలు పేరు సౌమ్య. కన్నడ సినీరంగంలో ప్రముఖ నిర్మాత సత్యనారాయణ కూతురు. కాలేజీలో ఉన్నప్పుడే సౌందర్యకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.
1992లో కన్నడ సినిమా పా నాన్న ప్రీతిసు మూవీతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ త్రవాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ త్రవాత తమిళంలో పొన్నుమణి సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. 1997లో డైరెక్టర్ సుందరి సి దర్శకత్వం వహించిన అరుణాచలం సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. హిందీలో అమితాబ్ బచ్చన్ జోడిగా సూర్యవంశం సినిమాలో కనిపించింది. సౌందర్య తెలుగులో ఎక్కువ సినిమాల్లో నటించింది. రజినీకాంత్, నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. 12 సంవత్సరాల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది.
పెళ్లి తర్వాత సైతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సౌందర్య.. 2004 ఏప్రిల్ 17న బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం తన సోదరుడితో కలిసి బెంగుళూరు నుంచి విమానంలో బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ పేలిపోయింది. దీంతో సౌందర్యతోపాటు ఆమె సోదరుడు సైతం మరణించారు. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే సౌందర్య ఆకస్మాత్తుగా మరణించింది. ఆమె మృతి ఇప్పటికీ ఇండస్ట్రీలో తీరని లోటు.
Soundarya
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..