
భారతీయ సినిమా ప్రపంచంలో ఒక్క సినిమాతో రికార్డులు సృష్టించిన నటులు చాలా మంది ఉన్నారు. హీరోగా తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుని.. రికార్డ్ స్థాయి వసూళ్లతో సంచలనం సృష్టించిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరో సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. జేబులో 300లతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. మొదట్లో సీరియల్స్ హీరోగా కనిపించాడు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా అవకాశాలు అందుకుని హీరోగా మెప్పించాడు. రూ.1200 కోట్ల సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన హీరో ఇప్పుడు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పెద్ద తెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల అతడు నటించిన కొత్త సినిమా టీజర్ ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందామా. అతడు మరెవరో కాదు.. రాకింగ్ స్టార్ యష్.
ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‌కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‌తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..
కేజీఎఫ్ 1 సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 2022లో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాతో మరోసారి సంచలనం సృష్టించాడు. ఈ మూవీ దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. రాకీ భాయ్ పాత్రలో యష్ యాక్టింగ్, మేనరిజం, స్టైల్, మాస్ ఎలివేషన్స్ అతడిని రాత్రికి రాత్రే స్టార్ గా మార్చాయి. ఈ మూవీ తర్వాత యష్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేశారు. కానీ అల జరగలేదు. కేజీఎఫ్ 2 తర్వాత దాదాపు మూడేళ్లు వెండితెరకు దూరంగా ఉండిపోయాడు. మూడు సంవత్సరాల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు టాక్సిక్ సినిమాతో అడియన్స్ ముందుకు వస్తున్నాడు.
ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‌ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..
టాక్సిక్ సినిమాకు యష్ రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో యాంటీ హీరోగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే టైటిల్, పోస్టర్ వైరల్ కాగా.. ఇటీవల విడుదలైన టీజర్ ఊహించని సెన్సేషన్ అయ్యింది. దీంతో మూడేళ్ల నిరీక్షణ తర్వాత చిన్న టీజర్ తో సోషల్ మీడియాను షేక్ చేశాడు యష్.. దీంతో ఇప్పుడు ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. నివేదికల ప్రకారం ఈ మూవీని ఈ ఏడాది మార్చి 19న అడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..