
2025 సంవత్సరం ఆరు నెలలు పూర్తైంది. అంటే ఈ ఏడాది దాదాపు సగం ముగిసింది. ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో ఏఏ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..? ఏవి అట్టర్ ప్లాప్ అయ్యాయి ? అనేది తెలుసుకుందామా. తాజాగా IMDb అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాల జాబితాను పంచుకుంది. అందులో ఒక సినిమా బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం 500 రెట్లు ఎక్కువగా రాబట్టాయి. అంతేకాదు.. ప్రభాస్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ హీరో గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.
ఇటీవల బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సికందర్, సితారే జమీన్ వంటి అన్ని చిత్రాలను వెనక్కి నెట్టి అత్యధిక వసూళ్లు సాధించింది. ఇది బాక్సాఫీస్ వద్ద చాలా కలెక్షన్స్ రాబట్టిన చారిత్రక చిత్రం. IMDb 1 జనవరి 2025 నుండి 1 జూలై 2025 వరకు ఉన్న సినిమాలను ప్రకటించింది. అందులో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన చావా అగ్రస్థానంలో ఉంది. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా అనే చారిత్రాత్మక చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న, వినీత్ వంటి తారలు నటించారు. ఈ చిత్రం రూ. 809 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. బడ్జెట్ రూ. 130 కోట్లు కాగా, ఈ చిత్రం 500% లాభం రాబట్టింది. ఇక ఈ సంవత్సరం ఇదే అతిపెద్ద బ్లాక్ బస్టర్.
ఛావాలో అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ , విక్కీ కౌశల్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక IMDB విడుదల చేసిన జాబితాలోడ్రాగన్ 2వ స్థానంలో, దేవా 3వ స్థానంలో, రైడ్ 2 4వ స్థానంలో, రెట్రో 5వ స్థానంలో, ది డిప్లొమాట్ 6వ స్థానంలో, ఎంపురాన్ 7వ స్థానంలో, సితారే జమీన్ పర్ 8వ స్థానంలో, కేసరి చాప్టర్ 2 9వ స్థానంలో, విదాముయార్చి 10వ స్థానంలో ఉన్నాయి.
ప్రస్తుతం ఛావా చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో రష్మిక, విక్కీ కౌశల్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు అందుకున్నారు.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..
Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..
Tollywood : అప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్గా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్తో రచ్చ.. ఎవరంటే..
Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్లో ఊహించని విధంగా..