
ఏలూరు : గోదావరి తీరంలో సినిమా లొకేషన్స్ చాలా ఉన్నాయి. తెలుగు సినిమా ను ఎక్కువ భాగం అవుట్ డోర్ లో తీసిన మొదటి సినిమా మూగ మనసులు. ఈ సినిమాలో చాలాభాగం నర్సాపురంలో ని వలంధర రేవు , రేవుకు ఎదురుగా వున్నా బిల్డింగ్ సినిమాలో సావిత్రి నివసించిన పెద్ద భవనంలోనే జరిగింది. అప్పట్లో హోటల్స్ , లాడ్జ్ ల సదుపాయం లేకపోవటం తో సినిమా యూనిట్ సభ్యులంతా స్థానికం గా పరిచయం వున్నా వారి ఇడ్లలోనే ఉండేవారట. 1964లో తీసిన ఈ సినిమా లో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు , హీరోయిన్ లుగా సావిత్రి , జామున నటించారు. ఆదుర్తి సుబ్బారావు దర్సకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో కోనసీమ , గోదావరి ప్రాంతాల్లో అవుట్ డోర్ షూటింగ్స్ ఎక్కువగా తరువాతి కాలంలోనే మొదలయ్యాయి.
మద్రాసులో ని స్టూడియో లకే పరిమితమైన చిత్రనిర్మాణాలు ఒకవిధంగా మూగ మనసులు మూవీ తోనే అవుట్ డోర్ లోకెషన్స్ కు మారాయట. ఇదే సినిమా హిందీ లో మిలన్ గా తీశారు. ఈ సినిమాలో హీరో సునీల్ దత్ ఆయన కూడా అప్పట్లో నరసాపురం వచ్చి నట్లు నాటి జ్ఞాపకాలను స్థానికులు ఇప్పటికి నెమరు వేసుకుంటారు. వలంధర్ రేవు లోనే మూగమనసులు సినిమాలో నాగేశ్వరరావు పడవ నడిపిన సన్నివేశాలు తీసారట. ప్రస్తుతం రేవు లో పెద్ద ఆర్చి నిర్మాణం జరిగింది. దానికి ఎదురుగా వున్నా టెంపుల్ సినిమాలో నూ కనిపిస్తుంది. ఆపక్కనే వున్నా భవనాన్ని 1920లో డచ్ వాళ్ళు నిర్మించారు. ఇప్పటికి ఈ భవనం అలాగే చెక్కు చెదరకుండా వుంది. ఈ భవనం పైన చాలా సంభాషణలు నాగేశ్వరరావు , సావిత్రి మధ్య ఉంటాయి.
ఈ భవనాన్ని కేవలం ఒక మూవీ లో ఉపయోగించిన బిల్డింగ్ గా మాత్రమే కాకుండా పురాతన చరిత్ర వున్నా భవనంగా చూసి దీన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందని నర్సాపురం కు చెందిన సామాజిక వేత్త దవేజీ చెబుతున్నారు. అప్పట్లోనే 175 రోజులు ఆడిన మూగ మనసులు చిత్రంలో ని భవనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా లోని నర్సాపురంలో కనిపిస్తుంది. అంతర్వేది వెళ్ళేప్పుడు లేదా నరసాపురం వెళితే ఈ బిల్డింగ్ నూ చూడండి. సావిత్రి , జమున , అక్కినేని తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికి నిలిచిఉండే నటులు కదా మరి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.