Parasakthi Movie: భలే తప్పించుకున్నారు.. ‘పరాశక్తి’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన మూవీ పరాశక్తి. సంక్రాంతి కానుకగా కేవలం తమిళంలో మాత్రమే విడుదలైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల కొరతతో ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ కు నోచుకోలేకపోయింది.

Parasakthi Movie: భలే తప్పించుకున్నారు.. పరాశక్తి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
Parasakthi Movie

Updated on: Jan 12, 2026 | 4:24 PM

అమరన్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు శివ కార్తికేయన్. ఇప్పుడీ ట్యాలెంట్ హీరోకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గతేడాది మదరాసి సినిమాతో మంచి హిట్ అందుకున్న శివకార్తికేయన్ నటించిన లేటెస్ట్ సినిమా పరాశక్తి. గురు, ఆకాశమే హద్దురా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి లైడీ డైరెక్టర్ సుధ కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శివకార్తికేయన్ తో పాటు రవి మోహన్ (జయం రవి), అధర్వ మురళి హీరోలుగా నటించారు. లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, తదితర సంఘటనల ఆధారంగా పరాశక్తి సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆడియెన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక థియేటర్ల కొరతతో ఈ పరాశక్తి మూవీ అసలు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కు నోచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో పరాశక్తి సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అదేంటంటే..పరాశక్తి సినిమాను మొదట వేరే హీరో, హీరోయిన్లతో అనుకున్నారు సుధా కొంగర. తొలుత ఈ మూవీలో హీరోగా సూర్యని, జయం రవి చేసిన రోల్‌ కోసం దుల్కర్ సల్మాన్‌ని అనుకున్నారు.ఇక హీరోయిన్‌గా నజ్రియా నజీమ్‌ని కూడా ఎంపిక చేశారు. సూర్య- సుధ కొంగర కాంబినేషన్ లో వచ్చిన ఆకాశమే హద్దురా సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ మూవీ నుంచి సూర్య తప్పుకున్నాడు. ఆ తరవాత దుల్కర్ సల్మాన్, నజ్రియా కూడా బయటకు వచ్చారు. దీంతో వీరి ప్లేస్ లో శివ కార్తీకేయన్‌, అధర్వ మురళి, శ్రీలీల వచ్చారు. అయితే ఇప్పుడీ పరాశక్తి సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో సూర్య, దుల్కర్, నజ్రియాలు భలే తప్పించుకున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

 

రెండు రోజుల్లో 51 కోట్ల కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .