
మరికొద్ది రోజుల్లో యానిమల్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ తోపాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో సక్సెస్ అందుకున్న సందీప్ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఇలా యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . ఈసినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ సినిమా పై అంచనాలను తారా స్థాయికి చేర్చాయి. ఈ క్రమంలో రీసెంట్ గా యానిమల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా హాజరయ్యారు. మహేష్ బాబుతో పాటుగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ ఈవెంట్ హాజరయ్యారు. హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అలాగే ఈ ఈవెంట్ కు పెద్దెత్తున స్టూడెంట్స్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే యానిమల్ ఈవెంట్ కు మహేష్ బాబు చాలా క్యాజివాల్ లుక్ లో వచ్చారు.
ఒక ప్లెయిన్ టీషర్ట్ , జీన్స్ వేసుకొని వచ్చి అందరిని డామినేట్ చేశాడు మహేష్ బాబు. అయితే మహేష్ వేసుకున్న టీషర్ట్ సింపుల్ గానే ఉంది కానీ దాని ధర మాత్రం దిమ్మతిరిగే రేంజ్ లో ఉంది. గివేంచి బ్రాండ్ కు చెందిన ఈ టీషర్ట్ చాలా కాస్ట్ గురూ.. దీని ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ టీషర్ట్ ధర అక్షరాలా రూ. 47వేలు. చూడటానికి సింపుల్ గా ఉంది కానీ ధర మాత్రం మైండ్ బ్లాక్ చేస్తుంది అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నారు.
Jai Babu ❤️💥🔥💪🏼 chants his smile 😍#MaheshBabu at #Animal Pre-release event#AnimalPreReleaseEvent @urstrulyMahesh #AnimalPreRelease #AnimalTheFilm #GunturKaaram pic.twitter.com/2QUBAiPLvT
— Dev (@_urs_dev) November 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.