
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా.. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సమంత డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఖుషి చిత్రాంలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాతోపాటు.. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రీమేక్‌లోనూ సామ్ నటిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో సామ్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి .
ఇక ఈ అమ్మడు షూటింగ్స్ కోసం వేరే రాష్ట్రాలకు.. విహారయాత్రలకు విదేశాలకు వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మడు ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. సామ్ ను చూడగానే కెమెరామెన్ లు క్లిక్ మనిపించారు. తాజాగా సమంత ఖుషి సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లింది. ఆసమయంలో ఎయిర్ పోర్ట్ లో సమంత కనిపించింది. అప్పుడు తీసిన ఫోటోల్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అయితే సమంత చెప్పుల ఖరీదు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మడి చెప్పులు లక్ష పైనే అంటున్నారు నెటిజన్లు. చాలా మంది సమంత చెప్పుల ధర గురించి గూగుల్ లో గాలించేశారు. సమంత ధరించిన చెప్పులు లూయిస్ విట్టన్ కంపెనీకి చెందినవి అని తెలుస్తోంది. వాటి ధర 2.5 లక్షలు అని తెలుస్తోంది.