దర్శక ధీరుడు రాజమౌళి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు రాజమౌళి. రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆతర్వాత దర్శకుడిగా మారారు. సినిమాల కంటే ముందు ఆయన ఓ సీరియల్ లోని సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు రాజమౌళి. ఆతర్వాత మరోసారి ఎన్టీఆర్ తో సింహాద్రి అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలా బ్యాక్ టు బ్యాక్ రాజమౌళి ఎన్టీఆర్ సినిమాలతో హిట్ అందుకున్నాడు.
ఆతర్వాత సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి:ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూషన్,ఆర్ఆర్ఆర్ సినిమాలు చేశారు. ఈ సినిమాలను బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. బాహుబలి సినిమా మొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డ్ క్రియెట్ చేసింది. ఈ సినిమా ఏకంగా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కూడా భారీగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేయడంతో పాటు ఆస్కార్ వేదిక పై కూడా మెరిసింది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది.
ఇదిలా ఉంటే రాజమౌళి ఇంతవరకు చేసిన సినిమాల్లో ఓ రీమేక్ సినిమా ఉందని మీకు తెలుసా..? అవును రాజమౌళి సినిమాను రీమేక్ చేశారు. ఆ సినిమా కూడా భారీ హిట్ గా నిలిచింది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే.. మర్యాద రామన్న. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఊహించని విధంగా ఆయన సునీల్ తో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమాను హాలీవుడ్ మూవీ నుంచి రీమేక్ చేశారు జక్కన్న. అది కూడా ఇప్పటి సినిమా కాదు వందేళ్ల కాలం నాటి సినిమా.. ఆ సినిమా పేరు అవర్ హాస్పిటాలిటి. ఈ సినిమానే రాజమౌళి మర్యాద రామన్నగా రీమేక్ చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.