వెంకటేష్ సూపర్ హిట్ మూవీ చంటి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

|

Apr 19, 2023 | 8:33 AM

వెంకటేష్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ మూవీ 1992 వ సంవత్సరం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో లోకజ్ఞానం లేని అమాయక యువకుడిగా నటించి మెప్పించారు వెంకటేష్.

వెంకటేష్ సూపర్ హిట్ మూవీ చంటి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
Chanti
Follow us on

సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే కెరీర్ లో ఎన్నో అద్బుతమైన సినిమాలు చేసి విజయాలనుడుకున్నారు వెంకీ. వాటిలో చంటి సినిమా ఒకటి. వెంకటేష్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ మూవీ 1992 వ సంవత్సరం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో లోకజ్ఞానం లేని అమాయక యువకుడిగా నటించి మెప్పించారు వెంకటేష్. ఈ సినిమాలో వెంకీ నటన, పాటలు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ మీనా నటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మీనా కంటే ముందుగా మరో భామను అనుకున్నారట.

చంటి సినిమాలో మీనా కంటే ముందుగా హీరోయిన్ కుష్బూను ఎంపిక చేశారట దర్శక నిర్మాతలు. అయితే ఆమె ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.  తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు కుష్బూ. ఆమె మాట్లాడుతూ..

చంటి చిత్రంలో నటించాలని దర్శకనిర్మాతలు ఆమెను కోరితే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకున్నట్టు తెలిపారు కుష్బూ..అయితే చంటి సినిమా తెలుగులో కంటే ముందు తమిళ్ లో తెరకెక్కింది. అక్కడ ప్రభు హీరోగా నటించగా కుష్బూ హీరోయిన్ గా చేశారు. ఆ తర్వాత తెలుగులో రీమేక్ చేసే సమయంలో ఇక్కడ కూడా కుష్బూనే హీరోయిన్ గా అనుకున్నారట. కానీ డేట్స్ కారణంగా ఆమె ఈ రీమేక్ కు నో చెప్పారట. దాంతో దర్శక నిర్మాతలు మీనాను ఎంపిక చేశారు. ఈ సినిమాలో మీనా నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే తమిళ్ కంటే తెలుగులో పెద్ద హిట్ గా నిలిచింది ఈ సినిమా.

Kushboo