Mahesh Babu: మహేష్ మావయ్య ఓ క్రికెటర్ అని మీకు తెల్సా.. సునీల్ గవాస్కర్‌తో ఆడారు

సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మన టాలీవుడ్‌లో చెప్పుకోవాల్సిన జంట. సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్. 'వంశీ' మూవీలో తనతో కలిసి నటించిన నమ్రత శిదోర్కర్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు మహేష్ బాబు.

Mahesh Babu: మహేష్ మావయ్య ఓ క్రికెటర్ అని మీకు తెల్సా.. సునీల్ గవాస్కర్‌తో ఆడారు
Mahesh Babu

Updated on: Jan 23, 2025 | 6:37 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి చేసుకున్న నటీనటులు చాలామందే ఉన్నారు. అందులో మన మహేష్ బాబు – నమ్రత కపుల్ ముందువరుసలో ఉంటారు. ‘వంశీ’ సినిమాలో ఈ పెయిర్ కలిసి నటించగా.. ఆ చిత్రం ద్వారానే వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇక మహేష్‌తో పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్‌బై చెప్పేసి.. పిల్లలను, ఇంటిని చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వీరి పెళ్లిని మొదట్లో సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోలేదట. అయితే మహేష్, నమ్రత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంతో కృష్ణ సైతం అంగీకరించకతప్పలేదట. ఆ తర్వాత వీరిరువురి రిలేషన్ చూసి కృష్ణ కూడా సంతోషించారట. ఇదంతా పక్కనపెడితే.. నమ్రత తండ్రి.. అదేనండీ మహేష్ బాబు మావయ్య ఓ క్రికెటర్ అని మీకు తెల్సా.. ఆ విషయం ఏంటంటే..

1977లో, జనవరి 22న మహారాష్ట్రలో పుట్టింది నమ్రత. ఆమె తండ్రి నితిన్ శిరోద్కర్. 70వ దశకంలో ఆయన క్రికెటర్‌గా రాణించేవారు. ముంబై తరపున పలు దేశవాళీ మ్యాచ్‌లు ఆడారు. దిలీప్ వెంగ్‌సర్కార్, సునీల్ గవాస్కర్ లాంటి స్టార్ ఆటగాళ్లతో నితిన్ శిరోద్కర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడారు. బ్యాట్‌తో మాత్రమే కాదు.. బంతితోనూ మెరుపులు మెరిపించేవారట నమ్రత తండ్రి. అలాగే నమ్రత తల్లి కూడా మోడలింగ్ రంగంలో రాణించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి