Suma: యాంకర్ సుమ, సౌందర్యతో కలిసి నటించిందని మీకు తెలుసా..? అది ఏ సినిమా అంటే

|

Mar 25, 2024 | 6:41 PM

ఎన్నో టీవీ షోలు, టాక్ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసింది సుమ.. అయితే సుమ సినిమాల్లోనూ నటించిందని తెలుసా.. అవును సుమ కనకాల కొన్ని సినిమాల్లో నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో ప్రభాస్ అక్కగా నటించింది. అలాగే ఈ మధ్య జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించింది. సుమ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Suma: యాంకర్ సుమ, సౌందర్యతో కలిసి నటించిందని మీకు తెలుసా..? అది ఏ సినిమా అంటే
Suma
Follow us on

టెలివిజన్ లో స్టార్ యాంకర్ గా రాణిస్తున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి షో అయినా.. ఎలాంటి ఈవెంట్ అయినా.. సుమ తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద ఈవెంట్ అయినా సుమ అవలీలగా హ్యాండిల్ చేయగలదు. ఎన్నో టీవీ షోలు, టాక్ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసింది సుమ.. అయితే సుమ సినిమాల్లోనూ నటించిందని తెలుసా.. అవును సుమ కనకాల కొన్ని సినిమాల్లో నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో ప్రభాస్ అక్కగా నటించింది. అలాగే ఈ మధ్య జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించింది. సుమ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సుమ కొడుకు కూడా ఇటీవలే హీరోగా మారాడు. బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

అలాగే సుమ అలనాటి అందాల తార సౌందర్యంతో కలిసి నటించిందని చాలా మందికి తెలియకపోవచ్చు.. అవును సుమ సౌందర్య కలిసి నటించారు. సౌందర్య ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆమె మరణించకపోయుంటే.. ఆమె ఇప్పటికీ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అయ్యుండేది. సౌందర్యను ఆమె అభిమానులు ఇప్పటికీ మిస్ అవుతున్నారు.

అయితే సౌందర్య, సుమ కలిసి నటించారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.. ఆ సినిమా పేరు కలిసి నడుద్దాం.!ఈ సినిమాకు కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ నటించారు. 2001లో విదులైన ఈ సినిమాలో సుమ కనకాల చిన్న పాత్రలో నటించింది. సుమ ఈ సినిమాలో సౌందర్య స్నేహితురాలుగా కనిపించింది. ఇందుకు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

సుమ కానుకల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.