Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ సోదరుడు కూడా టాలీవుడ్‌లో ఫేమస్ హీరో అని తెలుసా? ఏయే సినిమాల్లో నటించాడంటే?

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. అయితే సిద్దు అన్నయ్య కూడా టాలీవుడ్ హీరో అని చాలా మందికి తెలియదు.

Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ సోదరుడు కూడా టాలీవుడ్‌లో ఫేమస్ హీరో అని తెలుసా? ఏయే సినిమాల్లో నటించాడంటే?
Siddu Jonnalagadda Brother

Updated on: Nov 14, 2025 | 9:20 PM

టిల్లు సినిమాతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ టిల్లు సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు సిద్దు. ఇక దీనికి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమాతో అతని క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు సిద్దూ. టిల్లు స్క్వేర్ తర్వాత జాక్ సినిమా కాస్త నిరాశపర్చినా తెలుసు కదా సినిమాతో మరో హిట్ అందుకున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. నీరజకోన తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో సిద్దు చాలా కొత్తగా కనిపించాడు. అతని నటన అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు సిద్దు జొన్నలగడ్డ. జోష్, భీమిలి కబడ్డీ జట్టు, కల్కి సినిమాల్లో సహాయక నటుడిగా, విలన్ గా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. ఇప్పుడు సోలో హీరోగా వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నాడు. అయితే సిద్దు జొన్నలగడ్డ సోదరుడు కూడా టాలీవుడ్ లో ఉన్నాడని, హీరోగా సినిమాలు చేస్తున్నాడని చాలా మందికి తెలియదు. ఇప్పుడు సిద్దు సోదరుని పేరు మరోసారి నెట్టింట మార్మోగిపోతోంది. దీనికి కారణమేమంటే?

సిద్దు జొన్నలగడ్డ అన్నయ్య పేరు చైతు జొన్నలగడ్డ. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇప్పటికే పలు సినిమాలు చేశాడీ యాక్టర్. బబుల్‌‌గమ్‌, భామాకలాపం సినిమాల్లో అయితే తన నటనతో అదరగొట్టాడు. అలాగే నాని బ్లాక్ బస్టర్ మూవీ హిట్ 3లోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే ఓ మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు చైతు. ఇటీవలే ఈ సినిమా నుంచి చైతు ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సాయిలు కంపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు చైతు. ఈ సినిమా హిట్ అయితే చైతుకు మరిన్ని అవకాశాలు రావొచ్చని సినీ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

Siddu Jonnalagadda, Chaitu Jonnalagadda

ప్రస్తుతం రాజు వెడ్స్ రాంబాయి తో పాటు MM2 పేరుతో తెరకెక్కుతోన్న మరో సినిమాలోనూ నటిస్తున్నాడు సిద్దు. ఇందులో అతను హీరోగా నటించడంతో పాటు రైటర్ గా కూడా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. పీపుల్ ఫ్యాక్టరీ మీడియా ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం.

రాజు వెడ్స్ రాంబాయిలో చైతు జొన్నలగడ్డ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.