AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: జైపూర్ రాజకోటలో శర్వానంద్ వివాహం.. రోజుకు ఎన్ని కోట్లంటే..

హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ వంటి పలువురు సినీ ప్రముఖులు హజరయ్యారు. ఇటీవలే వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ వీరి వివాహనికి వేదిక కానుంది. జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్ గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Sharwanand: జైపూర్ రాజకోటలో శర్వానంద్ వివాహం.. రోజుకు ఎన్ని కోట్లంటే..
Sharwanand
Rajitha Chanti
|

Updated on: May 20, 2023 | 5:45 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ లో సాఫ్ట్ వేర్ గా ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితారెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సినీ సెలబ్రెటీల సమక్షంలో వీళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన  ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ వంటి పలువురు సినీ ప్రముఖులు హజరయ్యారు. ఇటీవలే వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ వీరి వివాహనికి వేదిక కానుంది. జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్ గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

శర్వానంద్, రక్షితారెడ్డిల వివాహం జూన్ 3న జరగనుండగా.. జూన్ 2న ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. అయితే జైపూర్ లోని లీలా ప్యాలెస్‏లో వివాహ వేడుకలు నిర్వహించాలంటే పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుంది. ఈ ప్యాలెస్ లో రోజుకు రూ. 4 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. వీరి పెళ్లికి కేవలం సన్నిహితులు, బంధువులు మాత్రమే హజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితంలో సినిమాలో కనిపించారు. అంతకు ముందు వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆయన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండడం వల్లే శర్వానంద్ పెళ్లి ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. శర్వానంద్ కు కాబోయే భార్య రక్షితా రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. హైదరాబాద్ కు చెందిన హైకోర్ట్ న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us