
సీనియర్ నటి రమాప్రభ గుర్తుందా… ? టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్రవేసింది. స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించి జనాలకు దగ్గరయ్యింది. దశాబ్దాల సినీప్రయాణంలో దాదాపు 1500లకు పైగా సినిమాలలో విభిన్న పాత్రలు పోషించింది. కృష్ణంరాజు హీరోగా నటించిన చిలక గోరింకా సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన డాక్టర్ ఆనంద్ మూవీలో ముఖ్య పాత్రలో కనిపించింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉండిపోయింది.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జగపతి బాబు ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. దివంగత నటుడు శరత్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లైన 14 సంవత్సరాలకు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. రమా ప్రభకు పిల్లలు లేరు. చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే మీడియా ముందుకు సైతం రావడం లేదు. కానీ మీకు తెలుసా.. రమా ప్రభ అల్లుడు తెలుగులో తోపు హీరో. ఆయన మరెవరో కాదు.. విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్. అసలు విషయానికి వస్తే..
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
రమాప్రభకు పిల్లలు లేకపోవడంతో తన చెల్లెలు కూతుర్ని దత్తత తీసుకుంది. ఆమె పేరు విజయ చాముండేశ్వరి. ఆమె భర్త రాజేంద్రప్రసాద్. ఒకప్పుడు కామెడీ సినిమాలకు రారాజు. అప్పట్లో హీరోగా, కామెడీ కింగ్ గా ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో సహయ నటుడిగా రాణిస్తున్నారు.
Ramaprabha, Rajendra Prasad
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..