Animal Movie: బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ వసూళ్ల జోరు.. ఇంతకీ రణబీర్ కపూర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?..

మొదటి రోజే దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.365 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం సృష్టిస్తోంది ఈ సినిమా. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకున్న సందీప్.. మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ రిపీట్ చేశాడు. తండ్రి కొడుకుల అనుబంధమే.. కానీ ఇందులో లవ్ స్టోరీ, వయలెన్స్, ఎమోషన్ సన్నివేశాలు సినిమాను హైలెట్ చేశాయి.

Animal Movie: బాక్సాఫీస్ వద్ద యానిమల్ వసూళ్ల జోరు.. ఇంతకీ రణబీర్ కపూర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?..
Animal Movie

Updated on: Dec 06, 2023 | 2:49 PM

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన సినిమా ‘యానిమల్’. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‏తో దూసుకుపోతుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజే దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.365 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం సృష్టిస్తోంది ఈ సినిమా. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకున్న సందీప్.. మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ రిపీట్ చేశాడు. తండ్రి కొడుకుల అనుబంధమే.. కానీ ఇందులో లవ్ స్టోరీ, వయలెన్స్, ఎమోషన్ సన్నివేశాలు సినిమాను హైలెట్ చేశాయి. ఇక ఇప్పటివరకు ఎన్నడు చూడని పాత్రలో రణభీర్ కనిపించి..తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. సందీప్ డైరెక్షన్, రణబీర్ యాక్షన్ సినిమాను అడియన్స్‏కు మరింత దగ్గర చేశాయి. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.

ఈ క్రమంలో యానిమల్ సినిమా నిన్నటి వరకు రూ.425 కోట్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు రణభీర్ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా యానిమల్ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించాయి. నివేదికల ప్రకారం ఈ సినిమాకు రణబీర్ షేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.70 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే రణబీర్.. ఇప్పుడు ఈ సినిమాకు అధిక బడ్జెట్ ఉపయోగించడంతో షేర్ ఫార్ములాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈసినిమా కోసం తన ఫీజు మొత్తాన్ని దాదాపు రూ.35 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. లాభాల షేర్లతో కలిపి రూ. 35 కోట్లు తీసుకుంటున్నాడట. ప్రస్తుతానికి ఈ సినిమాకు అధికంగానే కలెక్షన్స్ వస్తున్నాయి.

కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే సినిమా పెట్టుబడిలో 70 శాతం రాబట్టిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పటికే సినిమా నటీనటులు తమ పారితోషికాన్ని తీసుకున్నారు. బాబీ డియోల్, రష్మిక మందన్నలకు ఒక్కొక్కరికి రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అలాగే రణబీర్ తండ్రిగా నటించిన అనిల్ కపూర్ ఈ సినిమాకు రూ.2 కోట్లు వసూళు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రణబీర్ కెరీర్‏లో బిగ్గెస్ట్ ఒపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా షేరింగ్ తీసుకుంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.