
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ రమ్యకృష్ణ. దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్న ఆమె తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో కనిపించింది. ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహయ నటిగా రాణిస్తుంది. యంగ్ హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా కనిపిస్తుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా కెరీర్ పీక్స్ లో ఉండగానే నీలాంబరిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో రఫ్పాడించింది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో శివగామి పాత్రలో పాన్ ఇండియా అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. ఇదిలా ఉంటే రమ్యకృష్ణ తన సుధీర్ఘ సినీ ప్రయాణంలో ఒక నటుడికి చెల్లిగా, కూతురుగా, భార్యగా కనిపించింది. ఇంతకీ ఈ నటుడు ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదు.. విలక్షణ నటుడు నాజర్.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్, సౌందర్య జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ నరసింహ. ఇందులో నీలాంబరిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ సినిమాలో రమ్యకృష్ణ అన్నయ్యగా నటుడు నాజర్ కనిపించారు. ఇక తమిళంలో హిట్ అయిన వంత రాజవతాన్ వరుమేను సినిమాలో నాజర్ కూతురిగా కనిపించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సూపర్ హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమా రీమేక్ గా తెరకెక్కించారు. తెలుగులో నదియా పాత్రను రమ్యకృష్ణ పోషించారు.
ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుహలి సినిమాలో రమ్యకృష్ణ, నాజర్ భార్యభర్తలుగా కనిపించారు. అలా ఒకే నటుడికి రమ్యకృష్ణ కూతురిగా, భార్యగా, చెల్లిగా నటించారు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సహాయ నటిగా రాణిస్తున్నారు.
Ramya Krishna, Nassar
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..