
బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసి.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అద్భుతమైన నటన, అద్దిరిపోయే డ్యాన్స్, ఆకట్టుకునే డైలాగ్ డెలివరీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వరుసపెట్టి మాస్ సినిమాలు చేసి.. మాస్ హీరోల లిస్టులో నెంబర్ వన్‌లో నిలిచారు ఎన్టీఆర్. ఆయన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ నటించిన ఓ చిత్రం.. మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకుని.. ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
అప్పటికే ‘డిక్టేటర్’, ‘సోగ్గాడే చిన్నినాయన’ లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఆ సమయంలో విడుదలైంది ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’. మొదటి రోజు ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. క్లాస్ ప్రేక్షకులకు నచ్చినా.. మాస్ అభిమానులకు కనెక్ట్ కాలేదు. కానీ అనూహ్యంగా ఫస్ట్ షో ముగియగానే అటు క్లాస్.. ఇటు మాస్.. అలాగే ఓవర్సీస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.. ఫైనల్‌గా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. కాగా, ఈ చిత్రానికి ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ దర్శకుడు.