Mohan Babu- Vishnu: హీరోగా కాదు.. మంచు విష్ణుని మోహన్ బాబు ఏం చేయాలనుకున్నాడో తెలుసా? అసలు ఊహించలేరు

కలెక్షన్ కింగ్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారులు, కుమార్తె కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే తన పిల్లలు నటులు కావాలని మోహన్ బాబు ఎప్పుడూ కోరుకోలేదుట. తండ్రిగా వారి భవిష్యత్తు గురించి ఆయన కన్న కలలు చాలా వేరట.

Mohan Babu- Vishnu: హీరోగా కాదు.. మంచు విష్ణుని మోహన్ బాబు ఏం చేయాలనుకున్నాడో తెలుసా? అసలు ఊహించలేరు
Mohan Babu, Vishnu

Updated on: Jan 29, 2026 | 7:42 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబుది ప్రత్యేక స్థానం. విలన్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన హీరోగా సక్సెస్ అయ్యాడు. ఏకంగా 500 కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించాడు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. అలాగే డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అనే బిరుదులు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక మోహన్ బాబు సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన పిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మంచు విష్ణు, మనోజ్ హీరోలుగా రాణిస్తుంటే మంచు లక్ష్మి మరో ముందడుగు వేసి నటిగానే కాకుండా నిర్మాతగానూ, యాంకర్ గానూ ఆడియెన్స్ ను మెప్పిస్తున్నారు. అయితే మోహన్ బాబు తన పిల్లలను సినిమా ఇండస్ట్రీలోకి రావాలని కోరుకోలేదట. తన లాగే నటులు అవ్వాలని అనుకోలేదట. క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు తన పిల్లల విషయంలోనూ చాలా భిన్నంగ ఆలోచించారట. తండ్రిగా వారి భవిష్యత్తు గురించి ఆయన చాలా కలలు కన్నారట. అయితే కుమారులు మాత్రం వాటికి భిన్నంగా తమ దారులు ఎంచుకున్నారట. ఈ విషయాన్ని మోహన్ బాబే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మోహన్ బాబు తన పెద్ద కుమారుడు మంచు విష్ణును ఒక పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలని కలలు కన్నారట. అందుకు తగ్గట్టుగానే విష్ణు కూడా చిన్నప్పటి నుంచే చదువులో చురకుగా ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంజనీరింగ్ కూడా డిస్టింక్షన్ లో పూర్తి చేశాడు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ సత్తా చాటాడు విష్ణు. జేఎన్‌టీయూ తరపున నేషనల్ లెవల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ గా కూడా ఆడాడు. అయితే ఇంజనీరింగ్ తర్వాత తన తండ్రిలాగే నటన వైపు దృష్టి సారించాడు మంచు విష్ణు. ఇక చిన్న కుమారుడు మనోజ్ కూడా మంచి క్రికెట్ ప్లేయర్ ‘నా కుమారులను బలవంతంగా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకోలేదు. వారు నటులు కావడమనేది కేవలం దైవ నిర్ణయం’ అని మోహన్ బాబు చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

తండ్రి మోహన్ బాబుతో మంచు విష్ణు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.