
సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో ఎన్ని హిట్ సినిమాలున్నా మురారీ మాత్రం చాలా స్పెషల్. 2001లో విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, మహేశ్ బాబును ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేసింది. ఇందులోని కథ, కథనాలు, భావోద్వేగాలు, పాటలు, నటీనటుల యాక్టింగ్.. ఇలా అన్నీ సమపాళ్లలో కుదిరాయి. అందుకే ‘మురారి’ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫెవరేట్. కాగా ఇప్పుడీ మూవీ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. కొత్త సంవత్సరం కానుకగా బుధవారం (డిసెంబర్ 31) 4K వెర్షన్ తో మురారీ థియేటర్లలో రీ రిలీజైంది. మహేష్ అభిమానులతో పాటు ఆడియెన్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ మురారి సినిమాను తెరకెక్కించారు. సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అలాగే లక్ష్మీ, గొల్లపూడి, సత్య నారాయణ వంటి ఎందరో సినీ దిగ్గజాలు ఈ మూవీలో నటించారు. అయితే సినిమా కథ మొత్తం హీరో మహేష్ చుట్టే తిరుగుతుంది. అయితే ఈ మురారి సినిమాకు మహేష్ బాబు ఫస్ట్ ఛాయిస్ కాదట. కృష్ణవంశీ ముందుగా ఈ కథను అక్కినేని నాగార్జునకు వినిపించారట. అప్పటికే వీరి కాంబోలో నిన్నే పెళ్లాడతా వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. దీంతో నాగ్ కూడా మురారి సినిమా కథ విని చాలా బాగుందని కితాబు ఇచ్చాడట. అయితే ఈ కథ అక్కినేని సుమంత్ తో చేయాలని, తానే ఈ సినిమాను నిర్మిస్తానని నాగార్జున అన్నారట.
MURARI * CLIMAX * memoir … మురారి మొదలు అయింది.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. కానీ పతాక సన్నివేశం ఎలా అనేది తెగడంలేదు… మనసులో, మస్తిష్కం లో అలజడిగా వుంది… అన్ని సన్నివేశాలు అద్భుతంగా అమరుతున్నాయి…..కానీ క్లైమాక్స్….. అస్పష్టంగానే వుంది… మామూలు చిత్రం లా ఒక ఫైట్ తో… pic.twitter.com/fbe7TxUiUQ
— Krishna Vamsi (@director_kv) December 31, 2025
అయితే నాగార్జున ఆఫర్ కు కృష్ణవంశీ ఒప్పుకోలేదట. ఈ చిత్రాన్ని చేస్తే మీతోనే చేస్తాను, లేదంటే మహేష్ బాబు తో చేస్తాను అని చెప్పారట. అలా చివరికి మురారి కథ మహేష్ బాబు వద్దకి చేరింది. ఇక ఆ తర్వాత ఏమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
MURARI SONGS memoir…. మురారి ఇంతగా ఇప్పటికీ ఆదరింపపడడానికి ప్రధాన కారణం అద్భుతమైన పాటలు….ఆ పాటలు అంత అపురూపంగా అలరించడానికి ముఖ్యకారణం ఆ పాటల సాహిత్యామ్రృతాన్ని ఎంతో మథించి , స్రృజించి,స్రృష్టించిన అపర బ్రహ్మ లు , మహాకవులు… పాదాభి వందనాలు…
శ్రీ వేటూరి గారు *
……డుండుం… pic.twitter.com/oIUCVOlYtG— Krishna Vamsi (@director_kv) December 30, 2025