19 భాషలు..1000కి పైగా సినిమాలు.. 20వేలకు పైగా పాటలు.. ఇలా సుమారు 5 దశాబ్దాల పాటు తేనె కన్నా తియ్యనైన స్వరంతో సంగీత ప్రియులను ఓలలాడించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. ప్రముఖ గాయని వాణీజయరాం అనుమానాస్పద మరణంతో సినిమా ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇక ఆమె గొంతు వినబడదన్న చేదు నిజాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా తమిళనాడులోని వేలూరులో పుట్టి పెరిగిన వాణీ జయరాంకు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. వాణీ జయరాం సోదరుడు హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేశారు. ఇక వాణీ సినిమా రంగంలోకి రాకముందు మద్రాస్ ఎస్‌బీఐ బ్యాంకులో విధులు నిర్వర్తించారు . ఆ తర్వాత హైదరాబాద్‌లోని కోఠీ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. కొన్నేళ్ల పాటు ఇక్కడే విధులు నిర్వర్తించారు. ఇక ఈ లెజెండరీ సింగర్ వివాహం కూడా సికింద్రాబాద్‌లోనే జరిగింది.
‘నా మనసులో హైదరాబాద్‌కు ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. ఈ నగరంతో నాది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంటుంది. నా అసలు పేరు కలైవాణి. అయితే జయరామ్‌తో పెళ్లి తర్వాత వాణీ జయరామ్‌గా మారాను. జయరామ్ ఉద్యోగరీత్యా ఆయనతో పాటే ముంబై వెళ్లాను. కానీ పీబీ శ్రీనివాస్ అవార్డు, పి.సుశీల ట్రస్టు పురస్కారం, ఫిలింఫేర్ ఫర్ సౌత్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, సత్కారాలన్నీ హైదరాబాద్‌లోనే అందుకున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు వాణీ జయరాం.
మరోవైపు వాణీ జయరాం మృతిపై హఠాన్మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై గాయాలున్నట్లు పనిమనిషి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పని మనిషి చెప్పిన వివరాల ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇక సీఎం స్టాలిన్ కూడా దిగ్గజ గాయని మృతిపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
తన మధురమైన గాత్రంతో సినీ సంగీతానికి విశేష సేవలందించి ఎంతో మంది హృదయాలను గెలిచిన ప్రముఖ గాయనీ, పద్మ భూషణ్ వాణీ జయరాం గారి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.#VaniJayaram pic.twitter.com/1fzURSrX8N
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 4, 2023
ఐదు దశాబ్దాలుగా తన గాత్రంతో భారతీయులందరినీ అలరించిన ప్రఖ్యాత గాయకురాలు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీమతి వాణీ జయరాం గారి మరణ వార్త అత్యంత బాధాకరం.
జనసేన పార్టీ తరపున వారి కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఘన నివాళులు అర్పిస్తున్నాం.#VaniJairam pic.twitter.com/yRtBQ3kZnK
— JanaSena Party (@JanaSenaParty) February 4, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.