Divya Bharathi: వినీలాకాశంలో అందాల జాబిలి ఆమె.. దివ్య భారతి భర్త ఇప్పుడు ఎలా ఉన్నారో తెలిస్తే షాకవుతారు..

|

May 03, 2023 | 10:29 AM

నీల పెన్నై సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ ఆందాల తార. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ సరసన బొబ్బిలి రాజా చిత్రంలో నటించింది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో తెలుగులో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగులో అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు వంటి చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగులో స్టార్ హీరోయిన్‏గా రాణిస్తున్న సమయంలోనే ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వెల్లువెత్తాయి.

Divya Bharathi: వినీలాకాశంలో అందాల జాబిలి ఆమె.. దివ్య భారతి భర్త ఇప్పుడు ఎలా ఉన్నారో తెలిస్తే షాకవుతారు..
Divya Bharathi
Follow us on

దివ్య భారతి.. ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేని అందమైన రూపం. ఒకప్పుడు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. అంతేకాదు.. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అందంతోపాటు.. అద్భుతమైన అభినయంతో కోట్లాది మంది ప్రజల మనసులను కొల్లగొట్టింది. నీల పెన్నై సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ ఆందాల తార. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ సరసన బొబ్బిలి రాజా చిత్రంలో నటించింది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో తెలుగులో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగులో అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు వంటి చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగులో స్టార్ హీరోయిన్‏గా రాణిస్తున్న సమయంలోనే ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వెల్లువెత్తాయి.

దిల్ కా క్యా కసూర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే షారుఖ్, సల్మాన్ జోడిగా నటించి మెప్పించింది. హీరోయిన్ గా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేమ, పెళ్లి, మరణం త్వరగా తన జీవితాన్ని ముగించేశాయి. 1990లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. తెలుగు, హిందీ, తమిళంలో మొత్తం 21 సినిమాలు చేసింది. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ తనే.

అయితే హిందీలో షోలా ఔర్ షబ్ నం సినిమా షూటింగ్ సమయంలో గోవింద ద్వారా ఆమెకు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా పరిచయమయ్యాడు. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరు 1992 మే 10న రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన ఏడాదికే ఆమె ముంబైలోని తన బిల్డింగ్ పై నుంచి జారి కిందపడిపోయి చనిపోయింది. ఆమెను తన భర్తే తోసేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ సరైన ఆధారాలు లేకపోయేసరికి అది ఒక రూమర్ గానే మిగిలిపోయింది. ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే దివ్య భారతి మరణం అనంతరం సాజిద్ ఎన్నో అవమానాలను ఎదుర్కోన్నారట. అప్పటి నుంచి దివ్య భారతి తండ్రితోపాటు కలిసి ఉన్న ఆయన.. 2000వ సంవత్సరంలో వార్దా ఖాన్ ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చనిపోయేనాటికి దివ్య భారతి 11 సినిమాలకు సైన్ చేసింది. ఆమె మరణాంతరం ఆ చిత్రాల్లో శ్రీదేవి, జూహీ చావ్లా, పూజ భట్ నటించారు.

ఇవి కూడా చదవండి

Sajid

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.