Tollywood: ఘోరమైన బైక్ యాక్సిడెంట్.. కుడి కాలు తీసేయాలన్నా డాక్టర్స్.. మూడేళ్లు వీల్ చైర్‏లో ఉన్న హీరో.. కానీ ఇప్పుడు..

|

Jul 27, 2024 | 1:32 PM

చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. చిన్న వయసులోనే ఘోరమైన బైక్ యాక్సిడెంట్.. నాలుగేళ్లు నరకప్రాయమైన జీవితం.. కాళ్లను కాపాడుకునేందుకు ఏకంగా 23 ఆపరేషన్స్.. అయితా వదలని ఆత్మస్థైర్యంతో హీరోగా మారి కోట్లాది మంది అభిమానుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..?

Tollywood: ఘోరమైన బైక్ యాక్సిడెంట్.. కుడి కాలు తీసేయాలన్నా డాక్టర్స్.. మూడేళ్లు వీల్ చైర్‏లో ఉన్న హీరో.. కానీ ఇప్పుడు..
Actor
Follow us on

దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సీనియర్ స్టార్ హీరో. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలు పోషించి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 58 ఏళ్ల వయుసలోనూ 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ.. ఇప్పుడున్న యంగ్ హీరోలకు మంచి పోటీనిస్తున్నారు. ఆ హీరో నటనకు.. యాటిట్యూడ్.. స్వాగ్‏కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. చిన్న వయసులోనే ఘోరమైన బైక్ యాక్సిడెంట్.. నాలుగేళ్లు నరకప్రాయమైన జీవితం.. కాళ్లను కాపాడుకునేందుకు ఏకంగా 23 ఆపరేషన్స్.. అయితా వదలని ఆత్మస్థైర్యంతో హీరోగా మారి కోట్లాది మంది అభిమానుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..? అతడే కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్.

కెన్నేడీ జాన్ విక్టర్.. అలియాస్ చియాన్ విక్రమ్.. 17 ఏప్రిల్ 1966న జన్మించాడు. తండ్రి జాన్ విక్టర్ (అలియాస్ వినోద్ రాజ్) క్రిస్టియన్, అతని తల్లి రాజేశ్వరి హిందూ. విక్రమ్ చియాన్ తండ్రి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించగా.. తల్లి ప్రభుత్వ అధికారి. విక్రమ్ సోదరుడు, అరవింద్ తమిళ చిత్రం ఎప్పో కళ్యాణం (2022)లో కనిపించగా, అతని సోదరి అనిత టీచర్. ఏర్కాడ్‌లోని మౌంట్‌ఫోర్ట్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన విక్రమ్.. 1983 గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేశాడు. పాఠశాలలో కరాటే, గుర్రపు స్వారీ, స్విమ్మింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. చిన్నప్పుడే సినీరంగంలోకి అడుగుపెట్టాలనుకున్న విక్రమ్ ను అతడి తండ్రి చదువు పూర్తిచేయాలని ఆదేశించాడట. దీంతో MBA పూర్తి చేసిన విక్రమ్.. అలాగే చెన్నైలోని లయోలా కాలేజీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ పూర్తిచేశాడు.

విక్రమ్ 1990లో ఎన్ కాదల్ కన్మణి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విక్రమ్.. అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. 2003లో, పితామగన్ చిత్రంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. విక్రమ్ 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ సినిమాలో మూగ అబ్బాయి పాత్ర ఆఫర్ వచ్చింది. ఆ పాత్ర కోసం అతడికి ఐఐటీ మద్రాసులో ఉత్తమ నటుడిగా అవార్డ్ రావడంతో ఆ అవార్డు ప్రధానోత్సవం తర్వాత స్నేహితుడితో కలిసి వస్తున్నప్పుడు ఘోరమైన బైక్ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆ ఘటనలో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి కుడి కాలును తీసేయ్యాలని సూచించారు వైద్యులు. కానీ అందుకు అతడి తల్లి ఒప్పుకోలేదు. ప్రమాదం తర్వాత 4 సంవత్సరాలు వీల్ చైర్ కు పరిమితమయ్యాడు. కుడికాలు పూర్తిగా గాయపడిందని.. చీలమండ నుంచి మోకాలి వరకు ఎముకలు విరిగి చర్మం కందిపోయిందని.. తన కాలు తీసేయ్యకుండా కాపాడేందుకు దాదాపు 23 సర్జరీలు చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విక్రమ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.