Jr.NTR: ఎన్టీఆర్‏కు ఇష్టమైన సాంగ్ ఇదే.. ఎక్కువగా అదే వింటారట.. ఇంతకీ ఆ పాట మీరు విన్నారా ?..

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తారక్ మాస్ హీరోగా కనిపించనున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది.

Jr.NTR: ఎన్టీఆర్‏కు ఇష్టమైన సాంగ్ ఇదే.. ఎక్కువగా అదే వింటారట.. ఇంతకీ ఆ పాట మీరు విన్నారా ?..
Jr.ntr

Updated on: Jan 31, 2024 | 8:12 PM

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన నటిస్తోన్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తారక్ మాస్ హీరోగా కనిపించనున్నారు. అలాగే ఇందులో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది. జనతా గ్యారేజ్ తర్వాత తారక్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దేవరను చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తారక్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ ఏంటీ అనుకుంటున్నారా ?.. అయితే ఆ వివరాలు తెలుసుకోవాల్సిందే.

తారక్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ తెగ ట్రై చేస్తుంటారు. ఎన్టీఆర్ చిన్నప్పటి విషయాలు, ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ నెట్టింట నిత్యం షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్ ఫేవరేట్ సాంగ్ షేర్ చేస్తున్నారు. గతంలో ట్రిపుల్ ఆర్ మూవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తారక్ తనకు ఇష్టమైన సాంగ్ గురించి చెప్పుకొచ్చారు. షూటింగ్ నుంచి కాస్త సమయం దొరికినా ఎప్పుడూ అదే పాట వింటానని అన్నారు. ఇప్పటివరకు తన ఫోన్ లో ఎక్కువగా ప్లే చేసిన సాంగ్ అదే అని అన్నారు. ఇంతకీ ఏ సాంగ్ అనుకుంటున్నారా ?.. అదే “ఆశ పాశం బందీ సేసేలే.. సాగే కాలం ఆడే ఆటేలే.. ” సాంగ్. 2018లో విడుదలైన C/O కంచరపాలెం సినిమాలోనిది. ఈ పాటను తారక్ ఎంతో సునాయాసంగా పాడాడు.

“ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
సేరువైనా సేదూ దూరాలే
తోడౌతూనే ఈడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో

ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా

ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లో ఏవిల్లో ఎద కొలనుల్లో.. “

అంటూ సాగే ఈ పాటను స్వీకర్ అగస్తీ స్వరపరచగా, అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించారు. విశ్వ సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఇందులో సుబ్బారావు, కార్తీక్ రత్నం, రాధా బెస్సీ, కేశవ కర్రి కీలకపాత్రలు పోషించారు. స్వీకర్ అగస్తీ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us