
తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో రూపొందిన సినిమాల్లో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమా రాజన్న. 2011 విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాకు రచయిత వి.విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి కూడా దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పోరాట ఘట్టాలకు రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఉత్తమ చిత్రం రజత నందితో సహా ఆరు నంది అవార్డులు గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా స్నేహ నటించారు. ఆదిలాబాదు జిల్లా నేలకొండపల్లి గ్రామ నేపథ్యంలో జరుగుతుంది.
ఇక ఈ సినిమాలో నాగార్జున కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.? ఆ చిన్నారి పేరు బేబీ యాని. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది యాని. అనుకోకుండా ఒక రోజు (2005) చిత్రంతో అరంగేట్రం చేసింది యాని. ఆమె స్టాలిన్ (2006), అతిది (2007), స్వాగతం (2008), ఏక్ నిరంజన్ (2009), రాజన్న (2011) వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. మొన్నామధ్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది.
బాలనటిగా నంది అవార్డులు కూడా అందుకుంది. చిరంజీవి, మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు, గోపీచంద్, రామ్ పోతినేని, రామ్ చరణ్,లాంటి స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన యాని 2020లో లూజర్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోంది. యాని ఇప్పుడు చాలా అందంగా ఒక్క చూపుతో కుర్రాళ్ళను కట్టిపడేశాలా మారిపోయింది. రీసెంట్ గా నింద సినిమాలో నటించింది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నది తన క్యూట్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.