
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో శంకర్ దాదా జిందాబాద్ మూవీ ఒకటి. అంతకు ముందు వచ్చిన శంకర్ దాదా ఎం బీబీఎస్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు. హిందీలో విడుదలైన లగేరహో మున్నాభాయికు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ రేంజ్ లో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. కానీ సూపర్ హిట్ టాక్ మాత్రం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమా సాంగ్ లో రవితేజ, అల్లు అర్జున్ కూడా కనిపించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడు గుర్తుందా.? ఆమె పేరు కరిష్మా కోటక్.
శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఎంతో క్యూట్ గా నటించి మెప్పించింది కరిష్మా కోటక్. తన నటనతో అందంతో ప్రేక్షకులను మెప్పించింది కరిష్మా కోటక్. ఈ అమ్మడు ఓ బ్రిటీష్ మోడల్.. ఆతర్వాత హీరోయిన్ గా సినిమాలు చేసింది. శంకర్ దాదా సినిమా తర్వాత తెలుగులో తిరిగి నటించలేదు. ఆతర్వాత హిందీలో సినిమాలు చేసింది. కప్తాన్ అనే పంజాబీ సినిమాలోనూ నటించింది. అలాగే పలు టెలివిజన్ షోల్లోనూ నటించింది.
అలాగే హిందీ బిగ్ బాస్ సీజన్ 6 లోను పాల్గొంది కరిష్మా కోటక్. అలాగే స్పోర్ట్స్ ప్రెజెంటర్ గాను చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది కరిష్మా కోటక్. 2020 T10 లీగ్ లో ప్రెజెంటర్ గా చేసింది కరిష్మా కోటక్. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదానికి నెట్టింట మంచి డిమాండ్ ఉంది. ఈ చిరంజీవి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందొ తెలుసుకోవడానికి నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.