
రెబల్ స్టార్ ప్రభాస్ ను ఇప్పట్లో ఆపడం ఎవరి తరం కాదు.. ఇది అభిమానులంటున్న మాట. చూడబోతే అది నిజమే అనిపిస్తుంది. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చుస్తే మీరు ఇదే అంటారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు డార్లింగ్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమా సాహో. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.
రిజల్ట్ ఎలా ఉన్నా ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం కుమ్మేసింది. 2019, ఆగస్టు 30న సాహో సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో నటించిన లేడీ విలన్ గుర్తుందా.? ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. సాహో సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించింది. అలాగే ఈ సినిమాలో లేడీ విలన్ గా నటించిన ఆమె పేరు మందిరా బేడీ.
బాలీవుడ్ లో ఆమె చాలా ఫేమస్ యాక్ట్రస్. ఫ్యాషన్ డిజైనర్, టీవీ యాంకర్, అలాగే నటి కూడా.. 1999లో దూరదర్శన్ లో ప్రసారమైన శాంతి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత చాలా సినిమాల్ నటించింది. ఆమె ప్రధానంగా తమిళ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించి ఆకట్టుకుంది. మన్మధన్ అనే తమిళ్ సినిమాలోనూ నటించింది. కాగా సాహో సినిమా తర్వాత ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఈ బ్యూటీ వయసు 52 ఏళ్ళు అయినా కూడా తరగని అందంతో ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఆమె తన అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.