Trisha Krishnan: త్రిష మామూల్ది కాదు బాబోయ్..! మూడు నిమిషాల సాంగ్ కోసం కోట్లు అందుకుందా..!!

|

Sep 11, 2024 | 9:24 AM

విజయ్ ఈ సినిమా డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించారు. అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ్ రెండు భాషల్లో విడుదలై మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. నవంబర్ 5వ తేదీన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, వైభవ్, ప్రేమ్‌జీ.

Trisha Krishnan: త్రిష మామూల్ది కాదు బాబోయ్..! మూడు నిమిషాల సాంగ్ కోసం కోట్లు అందుకుందా..!!
Trisha
Follow us on

దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ఈ సినిమా డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించారు. అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ్ రెండు భాషల్లో విడుదలై మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. నవంబర్ 5వ తేదీన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, వైభవ్, ప్రేమ్‌జీ తదితరులు నటించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అర్చన కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇది కూడా చదవండి : Rana Daggubati: రానాతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఆమె చాలా ఫెమస్ హీరోయిన్

కాగా గోట్ సినిమా భారీగా కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. గోట్ సినిమా మూడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా 500కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష స్పెషల్ సాంగ్ లో మెరిసింది. దళపతి, త్రిష కాంబినేషన్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఈ ఇద్దరూ కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. విజయ్ లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా చేసింది. ఇక ఇప్పుడు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

ఇది కూడా చదవండి: సినిమాలో పద్దతిగా.. బయట మాత్రం బాబోయ్ బీభత్సం..! ఈ అమ్మడు గుర్తుందా..?

అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం త్రిష ఎంత పారితోషకం తీసుకుందో తెలుసా.. గోట్ సినిమాలో “మట్ట” పాటలో నటి త్రిష విజయ్‌తో కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గిల్లి సినిమాలోని సాంగ్ ను రీమేక్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాటలో డ్యాన్స్ చేయడానికి త్రిష దాదాపు రూ.1.2 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మూడు నిమిషాల సాంగ్ కోసం కోట్ల రూపాయిలు తీసుకోవడం మాములు విషయం కాదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.