మంచు విష్ణు హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మంచు విష్ణు ఇప్పుడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు భక్త కన్నప్ప అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు మంచి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా మొనీమధ్య పూజాకార్యక్రమంతో మొదలు పెట్టరు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుందా అని ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఇప్పుడు ఇదే సినిమాను లేటెస్ట్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో పదినిమిషాలు మాత్రమే ప్రభాస్ కనిపించనున్నారట. అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చర్చ జరుగుతోంది.
ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్ కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ ఫ్రెండ్ షిప్ తో ఇప్పుడు భకత కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా తక్కువే తీసుకుంటున్నారని తెలుస్తోంది. మాములూగా ప్రభాస్ ఒక్క సినిమాలు 90 నుంచి 100 కోట్ల వరకు ఉంటుంది.
భక్త కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ఇక ప్రభాస్ నటించిన సలార్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఆతర్వాత నాగ్ అశ్విన్ తో కలిసి కల్కీ, సందీప్ రెడ్డి తో కలిసి స్పిరిట్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.