NTR : అక్కడుంది యంగ్ టైగర్.. ఎన్టీఆర్ ఎన్ని సినిమాల్లో పాటలు పాడారో తెలుసా.?

తన నటనతో, డాన్స్ లతో డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు తారక్. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కూడా అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఈ సినిమాతో తారక్ క్రేజ్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. జపాన్ లోనూ తారక్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఈ తరంలో తారక్ లా డైలాగ్ చెప్పే నటుడు లేరు అంటే అది అతిశయోక్తి కాదు.

NTR : అక్కడుంది యంగ్ టైగర్.. ఎన్టీఆర్ ఎన్ని సినిమాల్లో పాటలు పాడారో తెలుసా.?
Ntr

Updated on: Feb 17, 2024 | 10:00 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ గురించి ప్రతిఒక్కరికి తెలుసు. ఆయన పేరు చెప్పినా.. తెరపై ఆయన కనిపించినా అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. తన నటనతో, డాన్స్ లతో డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు తారక్. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కూడా అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఈ సినిమాతో తారక్ క్రేజ్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. జపాన్ లోనూ తారక్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఈ తరంలో తారక్ లా డైలాగ్ చెప్పే నటుడు లేరు అంటే అది అతిశయోక్తి కాదు. ఎంతటి కష్టమైన డైలాగ్ నైనా యిట్టె ఒక్క టెక్ లోనే చెప్పే నటుడు తారక్. నటుడిగానే కాదు ఎన్టీఆర్ సింగర్ గాను అలరించారు. కొన్ని సినిమాల్లో ఆయన తన వాయిస్ ను వినిపించారు.

అసలు తారక్ మొత్తం ఎన్ని సినిమాల్లో పాటలు పాడారో తెలుసా..  తారక్ ఇప్పటివరకు ఆరు సినిమాల్లో తన వాయిస్ వినిపించారు. దర్శక ధీరుడు రాజమౌళ తెరకెక్కించిన యమదొంగ సినిమాలో ఓలమ్మి తిక్కరేగిందా అనే పాట ఎన్టీఆర్ పాడారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఆతర్వాత మణిశర్మ సంగీతం అందించిన కంత్రి సినిమాలో టైటిల్ ట్రాక్ పాడారు తారక్.

అలాగే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ చేత ఓ పాట పాడించారు. సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. రభస అనే సినిమాలో తమన్ సంగీత సారథ్యంలో అచ్చతెలుగు ఆడపిల్లలా అనే పాటను పాడారు ఎన్టీఆర్. ఇక మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన నాన్నకు ప్రేమతో సినిమాలో ఫాలో ఫాలో సాంగ్ పాడారు ఎన్టీఆర్. తెలుగులోనే కాదు కన్నడ భాషలోనూ ఓ పాట పాడారు తారక్. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన సినిమాలోనూ ఎన్టీఆర్ సాంగ్ పాడారు. ఇలా సింగర్ గాను తారక్ అభిమానులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లోనూ వార్ 2 సినిమా చేస్తున్నారు తారక్. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఎన్టీఆర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.