మాస్ మహారాజా రవితేజ చేస్తున్న సినిమాలన్నీ ఈ మధ్య ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. రవితేజ నుంచి ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ చాలా రోజులకు ధమాకా అంటూ హిట్ కొట్టారు. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత చాలా రోజులకు వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్నారు. చివరిగా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రవితేజ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో మిరపకాయ్ సినిమా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
2011లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. మిరపకాయ్ సినిమాలో రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ హీరోయిన్స్ గా చేశారు. అయితే ఈ ఇద్దరు హీరో ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. రిచా గంగోపాధ్యాయ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. కాగా దీక్ష సేథ్ గురించి ఇప్పుడు అందరూ గూగుల్ ను గాలిస్తున్నారు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది. ఎలా ఉంది అని తెగ సర్చ్ చేస్తున్నారు.
దీక్ష తెలుగులో వేదం సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. చివరిగా టాలీవుడ్ లో రెబెల్ సినిమాలో మెరిసింది. ఈ సినిమా తర్వాత ఆమె హిందీ కన్నడ భాషల్లో నటించింది. ప్రస్తుతం దీక్ష సేథ్ సినిమాలకు దూరంగా ఉంటుంది. 2017 తర్వాత దీక్షా సేథ్ సినిమాలకు దూరం అయ్యింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో దీక్షాను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి