Sakshi Shivanand: అమ్మబాబోయ్.. ఒకప్పటి అందాల తారా సాక్షి శివానంద్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..

మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది సాక్షి. ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి.

Sakshi Shivanand: అమ్మబాబోయ్.. ఒకప్పటి అందాల తారా సాక్షి శివానంద్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
Sakshi Shivanand.
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 25, 2023 | 6:35 AM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కొంతమంది అసలు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఇక చాలా మందిని మనం మర్చిపోయాం కూడా. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన భామల్లో సాక్షి శివానంద్ ఒకరు. అప్పట్లో తన అందంతో వయ్యారంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ భామ. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది సాక్షి. ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లతో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా నటించింది ఈ భామ.

తెలుగు, తమిళ్ ,కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన సాక్షి శివానంద్.. 2014తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. సాక్షి శివానంద్ 1996లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, ఆమె ఆదిత్య పంచోలి -నటించిన జంజీర్ (1998)లో నటించింది. ఆ తర్వాత ఆమె కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత ఏమైందో ఏమో సడెన్‌గా పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాలలో హీరోయిన్‌గా నటించింది సాక్షి. ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అసలు గుర్తుపట్టలేరు.

Sakshi Shivanand