Guntur Karam: మాస్‏గా కనిపిస్తోన్న ఖరీదైనదే.. ‘గుంటూరు కారం’ పోస్టర్‏లో మహేష్ ధరించిన షర్ట్ ధరెంతో తెలుసా..

|

Aug 16, 2023 | 5:54 PM

ముందుగా ఈ మూవీలో పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేయగా.. వివిధ కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని.. దీంతో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లుగా టాక్ నడిచింది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు చిత్రయూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి మహేష్ కు సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Guntur Karam: మాస్‏గా కనిపిస్తోన్న ఖరీదైనదే.. గుంటూరు కారం పోస్టర్‏లో మహేష్ ధరించిన షర్ట్ ధరెంతో తెలుసా..
Gunturu Karam
Follow us on

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ చేసిన రెండేళ్లు కావోస్తున్నా ఇప్పటికీ షూటింగ్ మాత్రం నెమ్మదిగానే జరుగుతుంది. ఇక కొంతకాలంగా ఈ సినిమా గురించి అనేక రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముందుగా ఈ మూవీలో పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేయగా.. వివిధ కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని.. దీంతో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లుగా టాక్ నడిచింది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు చిత్రయూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి మహేష్ కు సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ పోస్టర్ గురించి నెట్టింట క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ పోస్టర్‏లో క్లాసిక్ నలుపు రంగులో ఫ్యాషన్ ఫార్ ఫెచ్ R13 బ్లీచ్ వాష్ ప్లాయిడ్ లాంగ్ స్లీవ్ షర్ట్ లో మహేష్ ఉబెల్ కూల్ గా కనిపిస్తున్నారు. ఆడంబరానికి నిజమైన చిహ్నంగా కనిపిస్తోన్న ఆ షర్ట్ ధర రూ.74,509 అని తెలుస్తోంది. మాస్ లుక్ లో ఎంతో సింపుల్ గా కనిపిస్తోన్న ఆ షర్ట్ ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

గుంటూరు కారం మూవీ న్యూ పోస్టర్..

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న గుంటూరు కారం సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరితోపాటు.. యంగ్ హీరోయిన్ శ్రీలీల, జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

మహేష్ బాబు ఇన్ స్టా పోస్ట్..

గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ కాకుండా.. హాలీవుడ్ స్తాయిలో రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

మహేష్ బాబు ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.