తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమాలు వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన పాన్ ఇండియా సినిమాల హడావిడే కనిపిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు కంటెంట్ ను నమ్ముకొని పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే మంచి రిజల్ట్స్ కూడా సొంతం చేసుకుంటున్నాయి. ఒక సినిమా అభిమానుల మనసు గెలుచుకుని 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయాలంటే దానికి మంచి కథ, ప్రముఖ నటీనటులు ఉండాలి. 1000 కోట్ల క్లబ్ గురించి మాట్లాడినప్పుడల్లా అది ప్రముఖ నటుడి సినిమా అని చెప్తుంటారు. అయితే వెయ్యికోట్లు వసూల్ చేసిన సినిమా నటీనటులు గురించి ఓ సారి చూద్దాం. ఒకే ఒక్క సీనియర్ నటి రూ. 1000కోట్లు వసూల్ చేసిన సినిమాలో నటించి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇంతకూ ఆ సీనియర్ నటి ఎవరు.? ఆమె చేసిన సినిమా ఏంటి.? ఆమె మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. సినిమా రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. భారతీయ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో రమ్యకృష్ణ ఒకరు. సినీ పరిశ్రమలో గత 30 ఏళ్లుగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ. తమిళంలో, నటుడు రజనీకాంత్ బడయప్ప( నరసింహ)లో నీలాంబరి పాత్రను పోషించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత, ఆమె SS రాజమౌళి బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలిలో శివగామి పాత్రను పోషించింది. ఈ సినిమా ఆమెను మరోసారి ప్రేక్షకులకు దగ్గర చేసింది. 45 సంవత్సరాల వయస్సులో, రమ్య కృష్ణ రాజమౌళి బాహుబలి సినిమాతో మెప్పించింది. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడమే కాకుండా 1000 కోట్ల రూపాయల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా కూడా నిలిచింది. అలాగే మొదటి రూ. 1000కోట్లు వసూల్ చేసిన సినిమాలో నటించిన సీనియర్ హీరోయిన్ గా నిలిచారు రమ్యకృష్ణ.
1984లో మలయాళం సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. అంతకుముందు ఓ ప్రైవేట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ తన తమిళ, తెలుగు సినిమాలు నడవడం లేదని చెప్పింది. తనను ఒకప్పుడు ఫెయిల్ అయిన నటి అని పిలిచేవారని చెప్పింది. అయితే బాహుబలిలో శివగామి పాత్రతో మళ్లీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. రమ్యకృష్ణ కంటే ముందు ‘బాహుబలి’లో శివగామి పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించారు. శ్రీదేవి ఆ పాత్రలో నటించడానికి సమయం లేకపోవడంతో, రమ్యకృష్ణని సంతకం చేశారు. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ నికర విలువ రూ.98 కోట్లు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నటీమణులలో ఒకరు. ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్లు తీసుకుంటున్నారు రమ్యకృష్ణ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.