Pawan Kalyan: పవర్ స్టార్‌ను ఊహించి అందమైన కథ రాసుకున్న శేఖర్ కమ్ముల.. కానీ ఆ సూపర్ హిట్ ఎందుకు చేయలేదంటే..
ప్రస్తుతం పవన్ నటిస్తోన్న సినిమాలు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ. ఈ మూడు చిత్రాల షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే..ఇప్పుడు పవన్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఓ అందమైన కథను పవన్ మిస్సయ్యాడట. ఆయనను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథలో మరో నటుడు హీరో అయ్యాడు. ఆ సినిమా అతడికి బ్రేక్ ఇచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఆ తర్వాత తన సినిమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. చివరిసారిగా బ్రో సినిమాలో కనిపించారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవన్ మేనల్లుడు సాయి ధుర్గ తేజ్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ నటిస్తోన్న సినిమాలు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ. ఈ మూడు చిత్రాల షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే..ఇప్పుడు పవన్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఓ అందమైన కథను పవన్ మిస్సయ్యాడట. ఆయనను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథలో మరో నటుడు హీరో అయ్యాడు. ఆ సినిమా అతడికి బ్రేక్ ఇచ్చింది. అతడికి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు ఫీల్ గుడ్ స్టోరీ అనిపించిన శేఖర్ కమ్ముల సినిమా ఆనంద్..మంచి కాఫీలాంటి సినిమా. ఈ మూవీని పవన్ కోసం రాసుకున్నారు శేఖర్ కమ్ముల.
శేఖర్ కమ్ముల తెలుగు సినీ పరిశ్రమలో అందమైన చిత్రాలను అందించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన రూపొందించిన సినిమాలు కమర్షియల్ హిట్ కాకపోయినా.. అడియన్స్ హృదయాలను తాకుతాయి. యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. చదులు పూర్తి కాగానే అమెరికా వెళ్లిన శేఖర్ కమ్ముల అక్కడ సినిమాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు. ఆయన రాసుకున్న తొలి స్క్రిప్ట్ డాలర్ డ్రీమ్స్. తెలుగు, ఇంగ్లీష్ లో రూపొందించిన ఈ మూవీ హిట్ కాలేదని.. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా శేఖర్ జాతీయ అవార్డ్ అందించింది. ఆ తర్వాత ఆయన రాసుకున్న కథ ఆనంద్. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని కథను సిద్ధం చేసుకున్నాడట. కానీ ఈ సినిమా కోసం పవన్ ను సంప్రదించలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
పవన్ కోసం రాసుకున్న కథలో అప్పటికే మూడు సినిమాల అనుభవం ఉన్న రాజా ఆనంద్ పాత్రలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇందులో హీరోయిన్ గా ఆసిన్, సదాను అనుకున్నా.. చివరకు కమలినీ ముఖర్జీని తీసుకున్నారు. 2004 అక్టోబర్ 15న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల కుబేరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున, ధనుష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.