Ali: కమెడియన్ అలీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఎలా బ్రేకప్ అయ్యిందంటే
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. కేవలం అలీ కోసమే సినిమాలకు వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు వెయ్యి సినిమాలకు పైగా నటించి మెప్పించారు.
టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నారు అలీ. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సీతాకోక చిలుక సినిమాతో బాలనటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన అలీ. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. కేవలం అలీ కోసమే సినిమాలకు వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు వెయ్యి సినిమాలకు పైగా నటించి మెప్పించారు. ప్రస్తుతం పలు టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రముఖ టీవీ షోలో అలీతో సరదాగా అనే షో చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 300వందల ఎపిసోడ్స్ జరిగిన ఈ షో ఇప్పుడు ఆగిపోనుంది. 300ల మందిని అలీ ఈ షోను ఇంటర్వ్యూ చేశారు. కాగా చివరి ఎపిసోడ్ కు సుమ యాంకరింగ్ చేయగా అలీ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అలీ తన లైఫ్ లో జరిగిన చాలా విషయాలను పంచుకున్నారు. అలీ జీవితంలో ఎవరికీ తెలియని పలు విషయాలను పంచుకున్నారు అలీ. ఈ క్రమంలోనే తన లవ్ స్టోరీ కూడా చెప్పారు.
అలీ మాట్లాడుతూ.. నన్ను ఎవరు చూసినా అలీ మన మనిషే అనుకుంటారు. అది నేను చనిపోయే వరకు ఇలాగే ఉంటుంది. నేను మంచి చేస్తే అది నా పిల్లలకు కూడా వర్తిస్తుంది అని అన్నారు అలీ. ఇక సినిమాల విషయం కొస్తే నా కెరీర్లో మొట్టమొదటిసారిగా ‘సీతాకోకచిలుక’ చిత్రానికి అవార్డు అందుకున్నాను అని తెలిపారు. ఈ సినిమాతోనే అలీ బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత హీరోగా చేసిన ‘యమలీల’ చిత్రం ఏడాది పాటు ఆడింది. నా కెరీర్లో 150 పైగా సినిమాల్లో నేను తాగుబోతు పాత్రలో కనిపించాను. అని అన్నారు.
ఇక తన లవ్ స్టోరీ గురించి చెప్తూ.. మా ఇంటి దగ్గర ఓ అమ్మాయి ఉండేది. ఒకరోజు ఆమె జోరు వర్షంలో తడుచుకుంటూ వెళ్లడం చూశా.. ఆసమయంలో నాదగ్గర ఉన్న గొడుగును ఆమెకు ఇచ్చా.. తర్వాత మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే అది వాళ్ళ అమ్మగారికి నచ్చలేదు. అందుకే ఆ అమ్మాయితో విడిపోవాల్సి వచ్చింది’ అని తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని చెప్పుకొచ్చారు అలీ.