AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy vijay : ఆ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను దాటేసిన దళపతి విజయ్..

దళపతి నటించిన సినిమాలన్నీ వందకోట్ల వసూళ్లను అవలీలగా దాటేస్తూ ఉంటాయి. వరస విజయాలతో దూసుకుపోతోన్న విజయ్ ఇటీవల బీస్ట్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు', నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

Thalapathy vijay : ఆ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను దాటేసిన దళపతి విజయ్..
Vijay
Rajeev Rayala
|

Updated on: Dec 23, 2022 | 7:59 AM

Share

దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. తమిళ నట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు విజయ్. దళపతి నటించిన సినిమాలన్నీ వందకోట్ల వసూళ్లను అవలీలగా దాటేస్తూ ఉంటాయి. వరస విజయాలతో దూసుకుపోతోన్న విజయ్ ఇటీవల బీస్ట్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు, నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత ఇప్పుడు వారీసు అనే సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల కానుంది . తెలుగులో ఈమూవీ వారసుడు అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా వారసుడు సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ కు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే దళపతి విజయ్ కు రెమ్యునరేషన్ కు సంబంధించిన వార్తలు చాలానే చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరోసారి విజయ్ రెమ్యునరేషన్ పెంచేశాడని టాక్ వినిపిస్తోంది . వారసుడు సినిమాకు విజయ్ ఏకంగా 105కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. కాగా వచ్చే సినిమాలనుంచి విజయ్ మరింత ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోనున్నాడని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక పై విజయ్ ఒకొక్క సినిమాకు 150కోట్లకు రెమ్యునరేషన్ తీసుకోనున్నాడని టాక్ వినిపిస్తుంది. వారసుడు సినిమా తర్వాత విజయ్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఏఈ కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు . సుమారు 450కోట్ల బడ్జెట్ తో విజయ్ అట్లీ సినిమా ఉంటుందని తెలుస్తోంది . ప్రస్తుతం తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ అత్యంత ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో.. ఇప్పుడు ఆ ప్లేస్ ను దళపతి రీ ప్లేస్ చేశారు.

Follow Us
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?