Tollywood: ఆర్య సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ఆ స్టార్ హీరో.. చివరకు అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఆర్య. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా ప్రసామయితే టీవీలకు అతుక్కుపోతారు జనాలు. ఇక ఇందులో దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ మూవీలోని సాంగ్స్ వినిపిస్తుంటాయి.

Tollywood: ఆర్య సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ఆ స్టార్ హీరో.. చివరకు అల్లు అర్జున్..
Arya Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2024 | 8:06 PM

డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా పరిచయమైన తొలి సినిమా ఆర్య. 2004 మే 7న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. సరిగ్గా సమ్మర్ హాలీడేస్ మధ్యలో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. వన్ సైడ్ లవ్ కాన్సెప్టుతో సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను యూత్, అడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. థియేటర్లలో దాదాపు 125 రోజులు ప్రదర్శితమై ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్ అయ్యింది. ఇందులోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. దాదాపు రూ.4 కోట్లతో నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో రూ.30 కోట్ల వరకు వసూలు చేసింది. మలయాళం డబ్ చేస్తే రూ. 35 లక్షల వరకు రాబట్టింది. ఇక తొలి చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫీల్మ్ ఫేర్ అందుకున్నారు సుకుమార్.

వన్ సైట్ లవ్ అనే థీమ్ తో వచ్చిన ఆర్య సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే స్టార్ డమ్ అందుకున్నారు బన్నీ. ఇందులో శివబాలజీ కీలకపాత్ర పోషించాడు. సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఊహించని రేంజ్‏లో హిట్టయ్యింది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్ కాదట. అవును.. బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో అల్లరి నరేష్. ఆయనను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ కథ రాసుకున్నారట. కానీ ఏమైందో తెలియిదు కానీ ఆయన వరకు వెళ్లలేదు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. “సుకుమార్ 100 %లవ్ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశార. అల్లరి సినిమాలో మీ యక్టింగ్ నన్ను ఆకట్టుకుంది. ఆర్య సినిమా మీకోసమే రాసుకున్నాను అని చెప్పారు. కానీ ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్ కంటే బాగా ఎవరూ చేయలేరు ” అని చెప్పుకొచ్చారు.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.