Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కెరీర్‏లోనే బ్లాక్ బస్టర్ హిట్.. ‘బద్రి’ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా ?..

|

Apr 13, 2023 | 11:25 AM

2000 ఏప్రిల్ 20న విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. విజయలక్ష్మీ మూవీస్ బ్యానర్ పై టి. త్రివిక్రమ్ నిర్మించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే పూరి వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కెరీర్‏లోనే బ్లాక్ బస్టర్ హిట్.. బద్రి సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా ?..
Badri Movie
Follow us on

సాధారణంగా సినీపరిశ్రమలో ఒక హీరో వదులుకున్న సినిమా మరో హీరోకు లక్కీ ఛాన్స్ అవుతుంది. అనుకోని కారణాలతో అగ్ర హీరోలు వదులుకున్న సినిమాలు.. మరో యంగ్‏స్టర్స్ కు స్టార్ డమ్ తెచ్చిపెడతాయి. ఇప్పటివరకు అలా ఒకరికి రావాల్సిన విజయం మరోకరికి వచ్చిన సందర్బాలు చాలా ఎక్కువే ఉన్నాయి. అందులోనే బద్రి సినిమా కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం బద్రి. 2000 ఏప్రిల్ 20న విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. విజయలక్ష్మీ మూవీస్ బ్యానర్ పై టి. త్రివిక్రమ్ నిర్మించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే పూరి వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటివరకు ఉన్న మాస్ ఫార్ములాకి స్వస్తి చెప్పి.. సరికొత్త హీరోయిజాన్ని పరిచయం చేశాడు పూరి. నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ అప్పట్లో అభిమానులకు పూనకాలు తెప్పిందనే చెప్పాలి.

ఇక ఇందులో విలన్ క్యారెక్టర్ ప్లే చేసిన ప్రకాష్ రాజ్ కు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో నంద పాత్రలో నటించిన ఆయనకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అయితే ఇంత పెద్ద సక్సెస్ అందుకున్న ఈ సినిమాకు పవర్ స్టార్ ఫస్ట్ ఛాయిస్ కాదు. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ వద్దకు చేసింది ఈ కథ. ఈ సినిమాను రిజెక్ట్ చేసింది మరెవరో కాదు.. అక్కినేని నాగార్జున. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ కథను ముందు నాగార్జునకే చెప్పారట. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీకి నో చెప్పారట నాగ్. దీంతో ఈ స్టోరీ పవన్ వద్దకు వెళ్లింది.

ఇవి కూడా చదవండి

కానీ పవన్ కళ్యాణ్ సినిమా క్లైమాక్స్ మార్చి తీసుకురమ్మని కండిషన్ పెట్టారట. అందుకు పూరి.. బహుశా పవన్ కళ్యాణ్ కథ సరిగ్గా వినలేదనుకుని.. ఆ తర్వాత రోజు మళ్లీ అదే క్లైమాక్స్ చెప్పారట. దీంతో నిన్న చెప్పిన క్లైమాక్స్ కూడా ఇదే కదా అని పూరిని అడిగారట. ఇక పూరి ఓపెనే అవ్వక తప్పలేదు. క్లైమాక్స్ మార్చడం తనకు ఇష్టం లేదని.. మీరు సరిగ్గా వినలేదేమో అని భావించి మళ్లీ ఇంకోసారి చెప్పానని అన్నారు. క్లైమాక్స్ మారిస్తే కథ చేయనుకూడదనుకున్నాని.. పూరి కాన్ఫిడెన్స్ నచ్చిందని చెప్పి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాకు అప్పట్లే సెన్సెషన్ క్రియేట్ చేసింది.